Hyderabad: టిప్‌టాప్‌గా వచ్చిన మహిళలు.. కొంచెం తేడా కొట్టడంతో స్కాన్ చేసిన అధికారులు.. ప్రైవట్ పార్ట్స్‌లో..

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. రోజూ వేలాది మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే పోయే ప్రయాణికులతో ప్రాంగణంలో సందడి సందడిగా ఉంటుంది.

Hyderabad: టిప్‌టాప్‌గా వచ్చిన మహిళలు.. కొంచెం తేడా కొట్టడంతో స్కాన్ చేసిన అధికారులు.. ప్రైవట్ పార్ట్స్‌లో..
representational photo
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 30, 2023 | 8:11 AM

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. రోజూ వేలాది మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే పోయే ప్రయాణికులతో ప్రాంగణంలో సందడి సందడిగా ఉంటుంది. రోజూ లానే ప్రయాణికులు వస్తూ.. పోతున్నారు. అందరిలానే నలుగురు మహిళలు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు.. వారి ప్రవర్తనలో కొంచెం తేడా కొట్టడంతో అధికారులు వారిపై కన్నేశారు. ఆగండమ్మా.. అంటూ వారిని ఆపి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ.. వారి దగ్గర ఏమీ కనిపించలేదు.. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చి వారిని స్కాన్ చేసి చూశారు.. స్కానింగ్ లో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా బిత్తరపోయారు.. నలుగురు మహిళలు ప్రైవేట్ భాగాల్లో బంగారం దాచి అక్రమంగా రవాణా చేస్తుండగా.. కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారం స్వాధీనం చేసుకుని.. వారిని అరెస్టు చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు క‌స్టమ్స్ అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఎయిరేట్స్‌ సంస్థకు చెందిన ఈకే 527 విమాన సర్వీసులో నలుగురు మహిళా ప్రయాణికులు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో విమానం దిగిన నలుగురు మహిళా ప్రయాణికులపై నిఘా ఉంచారు. అనుమానంతో నలుగురు మహిళల లగేజీలు తనిఖీ చేశారు. అందులో ఏమీ కనిపించలేదు. అనంతరం మహిళలను స్కానింగ్‌ చేయగా వారి ప్రైవేట్‌ భాగాల్లో బంగారం గుర్తించారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్‌ చేసి బంగారం ముద్దలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. వాటిని తూకం వేయగా 3.175 గ్రాముల బరువు ఉందని.. దీని విలువ కోటి 94లక్షల రూపాయలుంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ న‌లుగురు మ‌హిళ‌ల‌ను క‌స్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసుల‌కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సీక్రెట్‌గా బంగారాన్ని పట్టుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో నిఘా పెట్టిన అధికారులు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రయాణికుల నుంచి గోల్డ్‌ సీజ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..