Warangal: వరదలో కొట్టుకొచ్చిన బాక్స్.. ఓపెన్ చేసి చూసిన స్థానికుడు.. కట్‌చేస్తే..
Warangal: వరంగల్‌లో ఓ బాక్స్‌లో పేలుడు సంభవించి ఓ వ్యక్తి తీవ్ర గాయాలు గాయాల పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో వున్న అతన్ని స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరదల్లో కొట్టుకు వచ్చిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది..? అందులో పేలుడు పదార్థాలు ఎక్కడివి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వరంగల్ - హనుమకొండ మధ్య హంటర్ రోడ్డులో జరిగింది.
Warangal: వరంగల్‌లో ఓ బాక్స్‌లో పేలుడు సంభవించి ఓ వ్యక్తి తీవ్ర గాయాలు గాయాల పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో వున్న అతన్ని స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరదల్లో కొట్టుకు వచ్చిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది..? అందులో పేలుడు పదార్థాలు ఎక్కడివి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన వరంగల్ – హనుమకొండ మధ్య హంటర్ రోడ్డులో జరిగింది. ఏన్టీఆర్ నగర్‌లో కెమికల్స్ వున్న బాక్స్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి భూక్య చంద్రు అనేవ్యక్తికి తీవ్ర గాయాలపాలయ్యాడు.
బొందివాగు వరదల్లో ఓ బాక్స్ కొట్టుకు వచ్చింది. రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునే చందు ఆ మూత తీయటంతో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. కాళ్ళు రెండు నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడ్డ చందుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ బాక్స్ ఎక్కడిది..? అందులోకి పేలుడు సంభవించే కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..