Wanaparthy: పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూసి హడల్..

పొలంలో రైతుకు ఏదో భారీ ఖాయం పాకుతూ వెళ్లడం కనిపించింది. దీంతో కాస్త భయంగానే అక్కడికి వెళ్లి చూసి.. కంగుతిన్నాడు. అక్కడ పెద్ద మొసలి ఉంది.

Wanaparthy: పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూసి హడల్..
Huge Crocodile
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 19, 2023 | 6:43 PM

పనుల నిమిత్తం తన వరి పొలానికి వెళ్లిన ఓ రైతు స్టన్ అయ్యాడు. భారీ మొసలిని నడిపొలంలో చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం చేరవేశాడు. జిల్లా స్నేక్ సొసైటీ నిర్వాహకుల దాన్ని రెస్క్యూ చేసి.. దగ్గర్లోని ప్రాజెక్ట్ నీటిలో వదిలేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన బాల్ రెడ్డి పంట పొలంలో మొసలి ఉందన్న వార్త తెలియడంతో.. గ్రామస్థలు తండోప తండాలుగా వచ్చారు. అక్కడ హడావిడి వాతావరణం నెలకుంది.  జిల్లా స్నేక్ సొసైటీ నిర్వాహకులు గ్రామస్థుల సాయంతో.. పొలంలోని మొసలిని తాళ్లతో బంధించి.. వాహనంలోకి ఎక్కించారు. ఆపై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి సూచన మేరకు ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టులో వదిలివేశారు.  ఆ మొసలి 12 అడుగుల పొడవు ఉండగా.. దాదాపు 270 కేజీల బరువు ఉందని తెలిసింది. నీటిలో ఉండాల్సిన మొసలి పంట పొలాల్లో ఉండటం ఆశ్చర్యపరిచే వార్తే. అందకే గ్రామంలోని ప్రజలందరూ మొసలిని వీక్షించడానికి అది ఉన్న ప్రదేశానికి తండోపతండాలుగా  తరలివచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.