Hyderabad: దారుణం.. హోటల్ ఓనర్‌పై ఐదు రౌండ్ల కాల్పులు.. అమ్మాయి కోసమేనా ?
విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో హోటల్ బయటే కాల్పులు జరిగాయి. కలకత్తాకు చెందిన దేవేందర్ స్థానికంగా ఉన్న సందర్శిని ఎలైట్ హోటల్‌కి జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్తున్న సమయంలో హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి టూ వీలర్ మీద వచ్చి దేవేందర్ పై కాల్పులు జరిపాడు. దేవేందర్ శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్‌లోని మదినగూడలో సందర్శిని హోటల్ మేనేజర్ దేవేందర్ దయాన్పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో హోటల్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో హోటల్ బయటే కాల్పులు జరిగాయి. కలకత్తాకు చెందిన దేవేందర్ స్థానికంగా ఉన్న సందర్శిని ఎలైట్ హోటల్‌కి జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్తున్న సమయంలో హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి టూ వీలర్ మీద వచ్చి దేవేందర్ పై కాల్పులు జరిపాడు. దేవేందర్ శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం కాల్పులకు తెగబడిన వ్యక్తి రిత్విక్ గా అనుమానిస్తున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. హోటల్లో పని చేసే ఒక మహిళ కోసమే కాల్పులు జరిగినట్టు అనుమానం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే హోటల్ సిబ్బంది మొత్తాన్ని ప్రశ్నించారు పోలీసులు. ఘటన స్థలం నుండి చికిత్స కోసం మొదట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దేవేందర్ చనిపోయినట్టు చెప్పటంతో పోస్టుమార్టం నిమిత్తం దేవేందర్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆ అమ్మాయి కోసమే కాల్పులు జరిగినట్టు అనుమానం
సందర్శిని హోటల్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి కోసమే కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్ కు చెందిన ఒక యువతి సందర్శిని హోటల్లో హౌస్ కీపింగ్ ఇన్చార్జిగా పనిచేస్తుంది. ఇదే హోటల్లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు దేవేందర్. ఆ యువతిని హౌస్ కీపింగ్ ఇన్చార్జిగా దేవేందర్ నియమించాడు. బీహార్‌కు చెందిన యువతిని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టాడు. సదరు యువతి కోసమే రిత్వీక్ అనే నిందితుడు దేవేందర్ పై కాల్పులు జరిపాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీసీ కెమెరా ఫుటేజ్, క్లూస్ టీమ్ వివరాలు సేకరణ
కాల్పులు జరిగిన ప్రదేశంలోనే హోటల్కు సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండటంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. స్పాట్‌కి చేరుకున్న క్లూస్ టీం మొత్తం 10 క్లూస్ ని సేకరించింది. ఇందులో ఆరు క్లూస్ బుల్లెట్‌కి సంబంధించినదే. వీటిని క్లూస్ టీమ్ ఐడెంటిఫై చేసింది. సీసీ కెమెరాల ద్వారా ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అతడి నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి