Motorola G62: కేవలం 699 రూపాయలకే మోటోరోలా 5జీ స్మార్ట్‌ఫోన్.. అంతేనా..? అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఓ సరికొత్త ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ ద్వారా మీరు కేవలం రూ. 699లకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.  మన జీవితంలో ఇంటర్నెట్ అనేది విడదీయరాని భాగంగా మారిపోయింది. ఇదే తరుణంలో..

Motorola G62: కేవలం 699 రూపాయలకే మోటోరోలా 5జీ స్మార్ట్‌ఫోన్.. అంతేనా..? అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా..
Motorola G62
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 04, 2023 | 3:42 PM

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఓ సరికొత్త ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ ద్వారా మీరు  5జీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 699 లకే పొందవచ్చు.  మన జీవితంలో ఇంటర్నెట్ అనేది విడదీయరాని భాగంగా మారిపోయింది. ఇదే తరుణంలో సెల్ ఫోన్ అనేది శరీర భాగం కంటే ముఖ్యమైనది ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 5జీ సేవలు కోరుకోనివారు ఎవరుంటారు మీరే చెప్పండి..? ప్రస్తుతం చాలా మంది దగ్గర ఇంకా 3జీ, 4జీ స్మార్ట్‌ఫోన్‌లే ఉన్నాయి. 5జీ సేవలు దేశంలో మొదలైనప్పటికీ అందుకోసం ఖరీదైన, కొత్త మోడల్ ఫోన్‌లను కొనాల్సిన పరిస్థితి. 5జీ సేవలను అందించే స్మార్ట్‌ఫోనను కొనడం అంటే అది కొంత భారమే కదా.. లైవ్ హిందూస్థాన్ ఇటీవలి కాలంలో ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఈ ఆఫర్ కింద Motorola కంపెనీ వారి Motorola G62, 5G స్మార్ట్‌ఫోన్‌ను 699 రూపాయలకే పొందవచ్చు. 

Motorola G62పై ఉన్న ఆఫర్ వివరాలు:

ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G62, 5G స్మార్ట్‌ఫోన్‌ ధర 21,300 రూపాయలుగా ఉంది. అయితే డిస్కౌంట్ ప్రైస్‌(31.81%)లో ఈ ఫోన్ కేవలం  14,999 రూపాయలుగా ఉంది. ఇంకా మీరు ఇంతకముందు నుంచే మోటోరోలా కంపెనీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అయితే మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల 14,999 రూపాయల ధరతో ఉన్న ఈ ఫోన్‌ను కేవలం 699 రూపాయలకే పొందవచ్చు. అలా మొత్తం 96.82 శాతం డిస్కౌంట్ ప్రైజ్‌లో మీరు Motorola G62, 5G స్మార్ట్‌ఫోన్‌‌ను మీ సొంతం చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

Motorola G62  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

Motorola G62, 5G స్మార్ట్‌ఫోన్‌ గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ మెమోరీతో వస్తుంది. 6.5 అంగుళాల HD+ డిస్ప్లేతో ఉన్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇక బ్యాటరీ పవర్ 5,000mAh ఉండగా ఇది 20W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు (50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ , 2 MP మాక్రో కెమెరా) ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం