POCO C50: అద్దిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన పోకో స్మార్ట్‌ఫోన్.. ధర 8 వేల కంటే తక్కువే.. బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయంటే..

జియోమీ వారి సబ్ బ్రాండ్  POCO నుంచి మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. ఈ రోజు(జనవరి 3) ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాంచ్ అయిన POCO C50 అదే యాప్ నుంచి కొనుగోలు చేయవచ్చు. సీ సిరీస్‌లో విడుదలైన..

POCO C50: అద్దిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన పోకో స్మార్ట్‌ఫోన్.. ధర 8 వేల కంటే తక్కువే.. బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయంటే..
Poco C50
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 03, 2023 | 3:33 PM

జియోమీ వారి సబ్ బ్రాండ్  POCO నుంచి మరో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. ఈ రోజు(జనవరి 3) ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాంచ్ అయిన POCO C50 అదే యాప్ నుంచి కొనుగోలు చేయవచ్చు. సీ సిరీస్‌లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ అన్లైన్ అమ్మకాలు ఈ నెల 10 నుంచి మొదలవుతాయి. అసలు ఈ ఫోన్ ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

POCO C50 ధర: 

POCO C50 రెండు RAM మోడల్‌లలో రాబోతుంది. వీటిలో 2GB ర్యామ్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,499 కాగా 3GB ర్యామ్ మోడల్ 32GBతో కలిపి రూ.7,299 ధరతో ఈ నెల 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఇక కంట్రీ గ్రీన్, రాయల్ బ్లూ రంగులతో రెండు వేరియంట్లుగా వస్తున్న ఈ ఫోన్‌కు ఒక సంవత్సరం వారంటీని అందిస్తుంది POCO కంపెనీ. అలాగే ఇన్ బాక్స్ యాక్సెసరీస్‌కు 6 నెలల వారంటీని కూడా ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

POCO C50 స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు:

POCO C50 స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.52-అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే MediaTek Helio A22 ప్రాసెసర్,  IMG పవర్ VR GPUతో పాటు మార్కెట్‌లోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ POCO C50 ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ అవుతుందా లేదా అనే విషయాన్ని దాని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. POCO నుంచి వచ్చిన ఈ ఫోన్ 5000 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో పాటు 10W ఛార్జింగ్ స్పీడ్‌ను కలిగి ఉంది.  ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది ఇక వినియోగదారుల భద్రత కోసం ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

అలాగే సింగిల్ స్పీకర్‌తో వస్తున్నఈ ఫోన్ ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా దాని వెనుక ఉన్న రెండో కెమెరా డెప్త్ సెన్సార్. వాటి కింద డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 4G, Wi-FI, బ్లూటూత్ 5.0, GPS వంటివి POCO C50 స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఫీచర్లు

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి