R Praggnanandhaa: 18 ఏళ్లకే చెస్ ప్రపంచ కప్‌‌ ఫైనల్, 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్.. ఇంతకీ ఎవరీ ప్రజ్ఞానంద‌..?

R Praggnanandhaa: చెస్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఈ యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఓడినప్పటికీ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫైనల్ ఆడిన రెండో భారతీయుడిగా  నిలిచాడు. ఇంతే కాదు, ఇప్పటివరకు చెస్ వరల్డ్ కప్ ఫైనల్ అడిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా ప్రజ్ఞానంద(18) రికార్డుల్లో నిలిచాడు. అలాగే వచ్చే ఏడాది జరిగే ‘కేండిడేట్స్ టోర్నీ’కి అర్హత సాధించిన ప్రజ్ఞానంద.. ఈ ఘనత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద విజయం సాధించిన మాగ్నస్ కార్ల్సన్, అమెరికా చెస్ దిగ్గజం..

R Praggnanandhaa: 18 ఏళ్లకే చెస్ ప్రపంచ కప్‌‌ ఫైనల్, 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్.. ఇంతకీ ఎవరీ ప్రజ్ఞానంద‌..?
R Praggnanadhaa
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 25, 2023 | 7:30 AM

R Praggnanandhaa: చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌ ప్రజ్ఞానంద‌పై నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్‌‌ విజయం సాధించాడు. గురువారం జరిగిన టై బ్రైకర్‌లో మొదటి గేమ్‌ని కార్ల్సన్ గెలుచుకోగా, రెండో మ్యాచ్ డ్రా అయింది. ఫలితంగా తమిళనాడుకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద‌పై వరల్డ్ నంబర్. 1 కార్ల్సన్‌ గెలిచి విజేతగా నిలిచాడు. అలాగే ప్రజ్ఞానంద చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో రన్నరప్‌గా మిగిలాడు. అంతకుముందు ఫైనల్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్.. బుధవారం జరిగిన రెండో గేమ్ డ్రా కావడంతో వరల్డ్‌కప్ ఫైనల్ విజేత ఎవరో తేల్చేందుకు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ టై బ్రేకర్ గేమ్‌లను నిర్వహించింది.

ఇదిలా ఉండగా.. చెస్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఈ యువ గ్రాండ్‌మాస్టర్ ఓడినప్పటికీ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫైనల్ ఆడిన రెండో భారతీయుడిగా  నిలిచాడు. ఇంతే కాదు, ఇప్పటివరకు చెస్ వరల్డ్ కప్ ఫైనల్ అడిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా ప్రజ్ఞానంద(18) రికార్డుల్లో నిలిచాడు. అలాగే వచ్చే ఏడాది జరిగే ‘కేండిడేట్స్ టోర్నీ’కి అర్హత సాధించిన ప్రజ్ఞానంద.. ఈ ఘనత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద విజయం సాధించిన మాగ్నస్ కార్ల్సన్, అమెరికా చెస్ దిగ్గజం బాబీ షిషర్ పదహారేళ్ల వయసులోనే కేండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు.

ఇవి కూడా చదవండి

R Praggnanadhaa Vs Magnus Carles; Chess World Cup Final

R Praggnanadhaa Vs Magnus Carles; Chess World Cup Final

సిల్వర్ మెడల్..

ప్రజ్ఞానంద నేపథ్యం..

ప్రజ్ఞానంద తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి రమేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వ సహకార బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటారు. పోలియో కారణంగా వైకల్యానికి గురైన రమేష్ బాబు తన అర్థిక ఇబ్బందుల నడుమనే ప్రజ్ఞానందకు చిన్నప్పటి నుంచి కూడా చెస్ ఆడేందుకు ప్రోత్సాహం అందించేవారు. ప్రజ్ఞానంద చెస్ టోర్నీలకు వెళ్తున్నప్పుడు అతని వెంట తల్లి నాగలక్ష్మి, అక్క వైశాలి వెంట ఉండేవారు. ప్రజ్ఞానంద తన అక్క కంటే నాలుగేళ్లు చిన్నవాడని, వైశాలి నుంచే అతను చెస్‌ మెలకువలు నేర్చుకున్నాడని, ఆమెను ఓడించాలని చెస్ ఆడడం అలవరచుకున్నాడని రమేష్ బాబు 2018లో ప్రజ్ఞానంద గ్రాండ్‌మాస్టర్ అయిన సందర్భంగా తెలిపారు. ప్రజ్ఞానంద చెస్ ప్రస్థానం గురించి చూస్తే.. 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్‌గా అవతరించాడు. విశేషం ఏమిటంటే.. ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడు ప్రజ్ఞానందనే. ఈ క్రమంలోనే 12 ఏళ్లకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించి, ఆ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. ప్రజ్ఞానంద కంటే ముందు ఉక్రెయిన్‌కి చెందిన సెర్గీ కర్జాకిన్ అత్యంత యువ గ్రాండ్‌మాస్టర్‌గా ఉన్నాడు.

2022లోనే మాగ్నస్‌పై విజయం..

తాజాగా జరిగిన చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో మార్నస్ గెలవడంతో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద 2022లోనే ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ని ఓడించాడు. ఆన్‌లైన్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో మాగ్నస్‌ని ఓడించిన ప్రజ్ఞానంద.. అతన్ని ఓడించిన మూడో భారతీయుడిగా కూడా నిలిచాడు. మాగ్నస్‌ని ప్రజ్ఞానంద కంటే ముందు విశ్వనాథన్ ఆనంద్, పెంటాల హారికృష్ణ ఓడించారు.

కాగా, ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలవడంపై చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పందించాడు. ప్రజ్ఞానంద చెస్ ఆటతో మళ్లీ పుంజుకోగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..