Lemon Leaves: మెరిసే చర్మం కోసం నిమ్మకాయ ఆకులు.. ఎలా ఉపయోగించాలంటే..? ఇప్పుడే తెలుసుకుందాం రండి..

Skincare: పనిభారం, కుటుంబ బాధ్యతలు, వాతావరణ కాలుష్యం కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు తరచూగా మార్కెట్‌లో లభించే నానా రకాల కాస్మటిక్స్ ఉపయోగించి, సమస్యలను మరింత తీవ్రతరం చేసుకుంటున్నారు. ఇవేం అవసరం లేకుండా, నిమ్మ ఆకుల రసం ఉపయోగించి కూడా అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించుకోవడంతో పాటు మెరిసే చర్మాన్ని కూడా పొందవచ్చు.

శివలీల గోపి తుల్వా

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 23, 2023 | 10:50 AM

Lemon Leaves for Skin: నిమ్మకాయలు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అని అందరికీ తెలిసిందే. నిమ్మకాయ మాదిరిగానే నిమ్మ ఆకులతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులను సరైన విధంగా ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.

1 / 5
డార్క్ సర్కిల్స్: ఒత్తిడి, అలసట ప్రభావంతో చాలా మంది సరిగ్గా నిద్రపోలేరు. ఫలితంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడి, ముఖం అందవికారం కనిపించేలా చేస్తాయి. ఈ నల్లని వలయాలను తొలగించుకునేందుకు నిమ్మ ఆకులు మెరుగ్గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు నిమ్మ ఆకుల పేస్ట్ చేసుకొని, దానికి ఓ రెండు చెంచాల తేనెను కలిపి.. డార్క్ సర్కిల్స్‌పై చేయండి. ఓ 10, 15 నిముషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

2 / 5
మృదువైన చర్మం: నిమ్మ ఆకులతో చేసిన ఔషధంలో మృదువైన చర్మం పొందవచ్చు. ఇందు కోసం కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో నిమ్మ ఆకుల రసం కలపండి. దాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి తర్వాత కడిగేయండి. ఇలా వరుసగా రెండు వారాలు చేస్తే మృదువైన చర్మాన్ని పొందుతారు.

3 / 5
మొటిమలు: మొటిమలను తొలగించుకోవడానికి కూడా నిమ్మ ఆకుల రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు ముల్తానీ మట్టిలో నిమ్మ రసం కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చాలు. 

4 / 5
మెరిసే చర్మం: మెరిసే చర్మం కోసం కూడా మీరు నిమ్మ ఆకులను ఉపయోగించవచ్చు. ఈ మేరకు మీరు నిమ్మ ఆకుల రసాన్ని తీసుకుని.. దానికి ఒక చెంచా కలబంద రసాన్ని కలపాలి. ఈ పేస్ట్‌ను దూదితో ముఖానికి అప్లై చేసిన 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయండి, ఆపై మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

5 / 5
Follow us