World Cup 2023: నాకౌట్‌లోకి ఎంటరై చరిత్ర సృష్టించిన చిన్నదేశం.. ప్రపంచకప్‌లో సంచలనం..
World Cup Knockouts: అభిమానులను సైతం ఆశ్చర్యపరిచిన ప్రపంచకప్ నాకౌట్‌లో ఓ చిన్న దేశం నేరుగా ప్రవేశించింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దేశ జనాభా దాదాపు ఢిల్లీతో సమానం ఉంటుంది. ఇప్పుడు ఈ దేశం ట్రోఫీని గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టనుంది. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కొలంబియాను 1-0తో ఓడించి నాకౌట్‌కు చేరుకుని మొరాకో చరిత్ర సృష్టించింది. అదే సమయంలో రెండుసార్లు ఛాంపియన్ జర్మనీ మొదటిసారి నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైంది.
World Cup Knockouts: ప్రపంచ కప్‌లో ఒక చిన్న దేశం నేరుగా నాకౌట్‌లోకి ప్రవేశించింది. దీని కారణంగా అభిమానులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దేశ జనాభా దాదాపు ఢిల్లీతో సమానంగా ఉంటుంది. ఈ దేశం ప్రత్యర్థి జట్టు కొలంబియాను 1-0 తేడాతో ఓడించింది.
చరిత్ర సృష్టించిన మొరాకో..
మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కొలంబియాను 1-0తో ఓడించి నాకౌట్‌కు చేరుకుని మొరాకో చరిత్ర సృష్టించింది. అదే సమయంలో రెండుసార్లు ఛాంపియన్ జర్మనీ మొదటిసారి నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైంది. మొరాకో మహిళల ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ అవరోధాన్ని దాటిన మొదటి అరబ్ లేదా ఉత్తర ఆఫ్రికా దేశం, నాకౌట్‌లకు అర్హత సాధించిన టోర్నమెంట్‌లో ఆడుతున్న ఎనిమిది కొత్త జట్లలో మొదటిది.
జర్మనీ కల చెదిరే..
తొలి అర్ధభాగం ఇంజురీ టైమ్‌లో అనిస్సా లహ్మరీ మొరాకోకు గోల్ అందించింది. ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్ పెనాల్టీ కిక్‌లో షాట్‌ను ఆపింది. అయితే, అనిసా రీబౌండ్‌లో గోల్ చేసింది. మొరాకో గ్రూప్ హెచ్‌లో కొలంబియా తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. దీంతో నాకౌట్‌కు చేరుకుంది. దీంతో 2 సార్లు ఛాంపియన్ జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కొలంబియా, మొరాకో రెండూ ఆరు పాయింట్లను కలిగి ఉండగా, జర్మనీ కేవలం నాలుగు పాయింట్లను మాత్రమే సాధించింది.
కొరియా, కొలంబియాలను ఓడించింది..
Morocco keeps making history! 🇲🇦
Women: First time heading to #FIFAWWC. Men: Fist time heading to QF of #FIFAWorldCup.
WHAT a year for @EnMaroc! 👏 pic.twitter.com/JyEch8joYh
— FIFA Women’s World Cup (@FIFAWWC) December 6, 2022
మొరాకో టోర్నమెంట్ అరంగేట్రంలో జర్మనీపై 0-6 తేడాతో ఓటమి చవిచూసింది. అయితే, కొరియా, కొలంబియాలను ఓడించి నాకౌట్‌లోకి ప్రవేశించింది. బ్రిస్బేన్‌లో జరిగిన అదే మ్యాచ్‌తో పాటు ఏకకాలంలో జరుగుతున్న మరో గ్రూప్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ టూ జట్టు జర్మనీని దక్షిణ కొరియా ఓడించాల్సి ఉంది. అయితే మ్యాచ్ 1-1తో ముగిసింది. కెప్టెన్ అలెగ్జాండ్రా పోప్ సారథ్యంలోని జర్మనీ పలు అవకాశాలను సృష్టించినా ఆ జట్టు గోల్ సాధించలేకపోయింది. తొమ్మిదోసారి మహిళల ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జర్మనీ జట్టు తొలిసారిగా గ్రూప్ దశ దాటి ముందుకు వెళ్లడంలో విఫలమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..