IPL 2023: 4 ఇన్నింగ్స్‌ల్లో 14 పరుగులు, 2 డకౌట్‌లు.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో తుఫాన్ సెంచరీ..
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో ఆదివారం సాయంత్రం పరుగుల మోత మోగింది. ప్రేక్షక పాత్ర పోషించిన బౌలర్లపై..
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో ఆదివారం సాయంత్రం పరుగుల మోత మోగింది. ప్రేక్షక పాత్ర పోషించిన బౌలర్లపై.. బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 258 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆ జట్టు బ్యాటర్ జాన్సన్ చార్లెస్ 39 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించి క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ అత్యధిక స్కోర్‌ను 7 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా చేధించింది. ఈ రికార్డు చేధనలో క్వింటన్ డికాక్ స్టార్‌గా నిలిచాడు.
గత 4 ఇన్నింగ్స్‌లలోనూ 14 పరుగులు, 2 డకౌట్‌లు అయిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్‌పై కేవలం 43 బంతుల్లోనే తుఫాన్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున క్వింటన్ డికాక్‌కి ఇదే తొలి టీ20 సెంచరీ. క్రీజులోకి వచ్చి.. మొదటి బంతి నుంచే విధ్వంసాన్ని సృష్టించాడు డికాక్. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీని బాదేశాడు. ఇది దక్షిణాఫ్రికా తరపున T20 ఇంటర్నేషనల్‌లో నమోదైన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. డికాక్ మొత్తం 44 బంతులు ఎదుర్కుని 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. అలాగే మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(68)తో కలిసి కేవలం 10.5 ఓవర్లలో 152 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డికాక్ ఔట్ అయిన అనంతరం మార్క్‌రమ్‌తో కలిసి హెండ్రిక్స్ తుది లక్ష్యాన్ని ముగించాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..