అరంగేట్రం చేసి మూడేళ్లు.. ఆడింది 7 బంతులు.. 4 డకౌట్‌లు.. పాక్ బ్యాటర్ చెత్త రికార్డు.. ఎవరంటే?
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్ మరోసారి జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్ మరోసారి జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటాడని అందరూ భావించినా.. చివరికి ఫెయిల్యూర్ బ్యాటర్‌గా పెవిలియన్ చేరాడు. 3 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసినప్పటికీ.. కేవలం 7 బంతులు ఆడి.. 4 సార్లు డకౌట్ అయ్యాడు.
ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో షఫీక్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి బంతికే ఫజల్ హక్ ఫరూఖీ చేతిలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు షఫీక్. అంతేకాదు టీ20ల్లో కూడా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేశాడు. మొదటి టీ20లో కేవలం 2 బంతులు ఆడి.. డకౌట్ అయిన షఫీక్.. టీ20ల్లో వరుసగా 4 మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు, అంతకముందు 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లలో కూడా షఫీక్ ఖాతా తెరవలేకపోయాడు. వెరిసి.. వరుస 4 మ్యాచ్‌ల్లో డకౌట్.. అలాగే గత మూడేళ్లలో ఈ ఆటగాడు టీ20ల్లో కేవలం 7 బంతులు మాత్రమే ఆడాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..