ODI World Cup 2023: ప్రపంచకప్‌ మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. టీమిండియా నయా షెడ్యూల్‌ ఇదే

సవరించిన వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. కొత్త షెడ్యూల్ ప్రకారం 9 మ్యాచ్‌ల తేదీలు మారాయి. ఇందులో టీమ్ ఇండియా 2 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మారిన షెడ్యూల్ ప్రకారం వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా జరగనుంది.

ODI World Cup 2023: ప్రపంచకప్‌ మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. టీమిండియా నయా షెడ్యూల్‌ ఇదే
Indian Cricket Team
Follow us

|

Updated on: Aug 11, 2023 | 7:40 AM

సవరించిన వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. కొత్త షెడ్యూల్ ప్రకారం 9 మ్యాచ్‌ల తేదీలు మారాయి. ఇందులో టీమ్ ఇండియా 2 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మారిన షెడ్యూల్ ప్రకారం వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా జరగనుంది. అక్టోబరు 11న ఢిల్లీలో భారత్ తన రెండో ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే అదే రోజే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా మ్యాచ్‌ను ఒక రోజు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ తర్వాత బంగ్లాదేశ్‌తో భారత్ నాలుగో మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 19న పుణె వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక అక్టోబర్ 22న జరిగే ఐదో మ్యాచ్‌లో ధర్మశాలలో గత ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ పటిష్ఠమైన న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

 రెండు మ్యాచులు..

అలాగే అక్టోబర్ 29న లక్నోలో మరో బలమైన జట్టు, గత ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆరో మ్యాచ్ ఆడనుంది. ఇక నవంబర్ 2న ముంబై వేదికగా జరిగే 7వ మ్యాచ్‌లో రోహిత్ సేన శ్రీలంకతో తలపడనుంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ 8వ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక చివరగా, లీగ్ దశలో నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ముందుగా ఈ మ్యాచ్‌ను నవంబర్ 11న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ మ్యాచ్‌ కూడా రీ షెడ్యూల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్ రీ షెడ్యూల్- ఐసీసీ ట్వీట్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..