IPL 2023: నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి.. రైజర్స్‌ రెడీ.. ఈసారైనా కలిసొచ్చేనా..?

ఏడేళ్లలో ఐదు సార్లు ప్లేఆఫ్‌లోకి వెళ్లింది. రెండు ఫైనల్స్‌, ఒక కప్‌. కాని గత రెండు సీజన్లలో ఘోర వైఫల్యం. సన్‌రైజర్స్‌ టీమ్ ఈసారి ఎలా పెర్ఫామ్ చేయబోతోంది? బడా టీమ్స్ లో ఒకటిగా ఉన్న SRH ఈరోజు సీజన్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి కనిపించబోతోంది. ఉప్పల్‌ స్టేడియం ఆరెంజ్‌ ఆర్మీతో నిండబోతోంది.

IPL 2023: నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి.. రైజర్స్‌ రెడీ.. ఈసారైనా కలిసొచ్చేనా..?
Ipl 2023
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2023 | 6:31 AM

ఏడేళ్లలో ఐదు సార్లు ప్లేఆఫ్‌లోకి వెళ్లింది. రెండు ఫైనల్స్‌, ఒక కప్‌. కాని గత రెండు సీజన్లలో ఘోర వైఫల్యం. సన్‌రైజర్స్‌ టీమ్ ఈసారి ఎలా పెర్ఫామ్ చేయబోతోంది? బడా టీమ్స్ లో ఒకటిగా ఉన్న SRH ఈరోజు సీజన్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి కనిపించబోతోంది. ఉప్పల్‌ స్టేడియం ఆరెంజ్‌ ఆర్మీతో నిండబోతోంది. వరుసగా రెండు సీజన్‌లలో వైఫల్యం నేపథ్యంలో కోచ్‌, కెప్టెన్‌తో సహా పూర్తి ప్రక్షాళన చేసిన సన్‌రైజర్స్‌ 2023 సీజన్‌కు సిద్ధమైంది. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ డెప్త్‌ను రెండేళ్లుగా పెంచుకుంటూ వస్తోంది. మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌శర్మ, రాహుల్‌ త్రిపాఠితో టాప్‌ ఆర్డర్‌ను సిద్ధం చేసుకుంది. ఇంగ్లాండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌, సఫారీ కొత్త కెప్టెన్‌.. ఇప్పుడు SRH కెప్టెన్‌ మార్‌క్రమ్‌, అబ్దుల్‌ సమద్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌లతో మిడిలార్డర్‌ను బలంగా తీర్చిదిద్దింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను కలుపుకుంటే ఎనిమిదో నంబరు వరకు సన్‌రైజర్స్‌కు బ్యాటర్లు ఉన్నట్లే. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌కు టైటిల్‌ అందించిన మార్‌క్రమ్‌ను హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. తొలి మ్యాచ్‌కు మార్‌క్రమ్‌ అందుబాటులో లేకపోయినా సీజన్‌ మొత్తానికి అతనే సారథి. గతేడాది సన్‌రైజర్స్‌ తరఫున రాణించిన మార్‌క్రమ్‌.. నాయకత్వ లక్షణాలు, అనుభవం, బ్యాటింగ్‌ ఫామ్‌ ఈసారి జట్టుకు కలిసిరావొచ్చు. జట్టులో బ్రూక్‌ చేరిక మరో కీలక పరిణామం. 24 ఏళ్ల బ్రూక్‌ ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు తరఫున రికార్డులతో హోరెత్తిస్తున్నాడు. పాకిస్థాన్‌లో ఇంగ్లాండ్‌కు చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయాన్ని అందించిన బ్రూక్‌.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌ల్లో 80.90 సగటు, 98.77 స్ట్రైక్‌రేటుతో 809 పరుగులు సాధించాడు. దేశవాళీ టీ20ల్లో 99 మ్యాచ్‌ల్లో 148.38 స్ట్రైక్‌రేటుతో 2432 పరుగులు రాబట్టాడు. భారీ అంచనాలతో బరిలో దిగుతున్న బ్రూక్‌ ఐపీఎల్‌ స్టార్‌ అవుతాడో లేదో చూడాలి.

ఎప్పట్లాగే సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగానికి భువనేశ్వర్‌ కుమార్‌ నాయకత్వం వహించనున్నాడు. మార్‌క్రమ్‌ గైర్హాజరీలో రాజస్థాన్‌తో పోరులో భువి జట్టును ముందుండి నడిపించనున్నాడు. భువి స్వింగ్‌, అనుభవం సానుకూలాంశాలే అయినా అతనిలో మునుపటి వాడి కనిపించడంలేదు. డెత్‌లో అతని బౌలింగ్‌ సామర్థ్యంపైనా సందేహాలు ఉన్నాయి. ఇక భువి, ఉమ్రాన్‌ మాలిక్‌, యాన్సెన్‌, నటరాజన్‌లతో సన్‌రైజర్స్‌ పేస్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఉమ్రాన్‌, యాన్సెన్‌లూ సమర్థులైన పేసర్లే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్న జమ్మూకాశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ ఈసారి సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. గతేడాది 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో రాణించిన అతను.. టీమ్‌ఇండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అనుభవమూ సంపాదించాడు. గత సీజన్‌లో 7 నుంచి 16 ఓవర్ల మధ్య 19 వికెట్లు తీసిన మాలిక్‌ మరోసారి మిడిల్‌ ఓవర్లలో ప్రభావం చూపించగలడు. గుజరాత్‌కు తరలివెళ్లిన లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ లోటు అడిల్‌ రషీద్‌ ఎలా భర్తీ చేస్తాడన్నది ఆసక్తికరం.

2008 ఆరంభ ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ మరోసారి టైటిల్‌ కోసం దండయాత్ర చేస్తూనే ఉంది. గతేడాది ఫైనల్‌ వరకు వచ్చిన రాజస్థాన్‌ చివరికి రన్నరప్‌ గా నిలిచింది. ఒకరిద్దరు మినహా దాదాపు పాత జట్టుతోనే బరిలో దిగుతున్న రాజస్థాన్‌ ఈసారి టైటిల్‌పై గురిపెట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న రాజస్థాన్‌ సమష్టిగా సత్తాచాటితే ప్రభావం చూపించగలదు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ రాజస్థాన్‌ బ్యాటింగ్‌కు వెన్నుముకగా నిలవనున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, యశస్వి జైశ్వాల్‌.. బౌలింగ్‌లో చాహల్‌, అశ్విన్‌, బౌల్ట్‌ కీలకం కానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం..