Sri Ramanavami: ఈ ఏడాది రామనవమి వెరీ వెరీ స్పెషల్.. 700 ఏళ్ల తర్వాత ఈ గ్రహాల, రాశుల కలయిక ..తొమ్మిది యోగాలు ఒక్కసారే

హిందూ విశ్వాసం ప్రకారం..  రాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున..పునర్వసు నక్షత్రం శుభ సమయంలో జన్మించాడు. పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం రామ నవమి నాడు ఏర్పడిన గ్రహాలు.. రాశుల స్థానాలను పరిశీలిస్తే, 700 సంవత్సరాల తర్వాత, 09 శుభ యోగాలు కలుగుతున్నాయి.

Sri Ramanavami:  ఈ ఏడాది రామనవమి వెరీ వెరీ స్పెషల్.. 700 ఏళ్ల తర్వాత ఈ గ్రహాల, రాశుల కలయిక ..తొమ్మిది యోగాలు ఒక్కసారే
Sri Rama Navami
Follow us
Surya Kala

|

Updated on: Mar 30, 2023 | 1:37 PM

చైత్ర శుధ్ద నవమి రోజున శ్రీరాముని జన్మదినం సందర్భంగా రామ నవమి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ సంవత్సరం రామ నవమి తేదీ వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. ఈ రోజు  త్రేతాయుగంలో ఏర్పడిన నక్షత్రరాశులు..  యోగాను పునరావృతం చేస్తోంది. ఈ యోగం సుమారు 700 సంవత్సరాల క్రితం రామ నవమి నాడు ఏర్పడిందని నమ్మకం. శ్రీరాముడి పూజకు ఈరోజు అత్యంత ప్రాముఖ్యత ఉందని.. నేడు అనేక ఇతర శుభ యోగాలు జతకలిశాయని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ పవిత్రమైన నవమి అన్ని రకాల శుభకార్యాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

హిందూ విశ్వాసం ప్రకారం..  రాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున..పునర్వసు నక్షత్రం శుభ సమయంలో జన్మించాడు. పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం రామ నవమి నాడు ఏర్పడిన గ్రహాలు.. రాశుల స్థానాలను పరిశీలిస్తే, 700 సంవత్సరాల తర్వాత, 09 శుభ యోగాలు కలుగుతున్నాయి. పంచాంగం ప్రకారం, మహాలక్ష్మి, బుధాదిత్య, హన్స్, సిద్ధి, కేదార్, సర్వార్థసిద్ధి, గజకేసరి, సత్కీర్తి, రవియోగం నేడు ఏర్పడుతున్నాయి. ఈరోజు ఈ యోగాలన్నీ శ్రీరాముని ఆరాధన చేసిన వారికీ పుణ్యఫలాన్ని ఇవ్వబోతున్నాయి. చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడానికి ఈ యోగాలు పనిచేస్తాయి.

రామ నవమి పూజ శుభ సమయం శ్రీ రామ నవమి పంచాంగం ప్రకారం, చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిథి మార్చి 29, 2023 బుధవారం రాత్రి 09:07 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 30, 2023 గురువారం రాత్రి 11:30 వరకు ఉంటుంది. ఈ రోజున శ్రీరాముడిని పూజించడానికి ఉత్తమ ముహూర్తం ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 01:40 వరకు ఉంటుంది. అయితే, ఈ రోజున మరెన్నో శుభ ముహూర్తాలు ఉన్నాయి.  రామ నవమి రోజున ఉదయం 10:59 నుండి మరుసటి రోజు ఉదయం 06:13 వరకు గురు పుష్య యోగం ఉంటుంది. అదే సమయంలో, సర్వార్థ సిద్ధి యోగం రోజంతా ఉంటుంది. అదేవిధంగా, రామ నవమి నాడు, అమృత సిద్ధి యోగం రాత్రి నుండి మరుసటి రోజు వరకు అంటే మార్చి 31, 2023 06:13 వరకు ఉంది.

రామ నవమి రోజున చేయాల్సిన పనులు ఏమిటంటే?  శ్రీ రామ నవమి రోజున.. భక్తి శ్రద్దలతో శ్రీరాముడిని పూజిస్తే.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పూజ చేసేటప్పుడు, దేవుడికి కలువ పువ్వులు లేదా తామర పువ్వులను.. మొగలి పువ్వులను సమర్పించండి.  పవిత్ర నదిలో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల సాధకుడి పాపాలు నశించి, శరీరం, మనస్సు పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. ఈరోజు, రామనవమి రోజున, పూజ-పారాయణ మాత్రమే కాదు, దానం-దక్షిణకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీ శక్తి మేరకు నిరుపేదలకు అవసరం ఉన్నవారికి ఆహారం, వస్త్రం ఇలా అవసరం ఉన్న వస్తువులను దానంగా ఇవ్వండి.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)