Taj Mahal Construction: తాజ్ మహల్ నిర్మాణం ఎలా ఉందంటే.. AI ‘గ్లింప్స్’ చూపిస్తున్న దృశ్యాలు మీ కోసం..

పాల రాయితో అందంగా కనువిందు చేసే తాజ్ మహల్‌ని తప్పక చూసి ఉంటారు. ప్రేమ చిహ్నంగా కీర్తించబడుతున్న తాజ్ మహల్ ను నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉన్న దృశ్యం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని సాధ్యం చేసింది. ప్రస్తుతం తాజ్ మహల్ కు సంబంధించిన నిర్మాణాన్ని వర్ణించే కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. 

Surya Kala

|

Updated on: Jul 18, 2023 | 6:20 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడిన అద్భుతమైన, కలలో కూడా  ఊహకు అందని చిత్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటిగా తాజ్ మహల్ కీర్తిగాంచింది. తాజ్ మహల్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూస్తే దాని నిర్మాణ సమయంలో వీక్షణ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 370 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణం తర్వాత షాజహాన్ అలాంటి భవనాన్ని మరెవరూ నిర్మించకూడదని కూలీల చేతులు నరికివేసినట్లు చెబుతున్నారు.

1 / 5
తాజ్ మహల్ నిర్మాణం వివిధ దశలు వైరల్ అవుతున్న చిత్రాలలో చూపించబడ్డాయి. ఇందులో పని చేస్తున్న కూలీలను చూడవచ్చు. అదే సమయంలో, తాజ్ మహల్ ఎత్తైన మినార్లను ఎలా నిర్మించారో కూడా వర్ణించారు. చివరికి తాజ్ మహల్ రూపం దర్శనం ఇచ్చింది. ఈ చిత్రాలను చూసి ఎవరైనా మైమరచిపోతారు.

2 / 5
AI ద్వారా తాజ్ మహల్ నిర్మాణాన్ని వర్ణించే ఈ చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో jyo_john_mulloor అనే ఖాతాలో షేర్ చేశారు. 

3 / 5
'గతంలోకి ఒక సంగ్రహావలోకనం! షాజహాన్ అద్భుతమైన వారసత్వాన్ని రూపొందించడంలో ఒక సంగ్రహావలోకనం అంటూ జాన్ ముల్లూర్ పేర్కొన్నారు. అంతేకాదు తాను షాజహాన్ నుంచి అనుమతిని తీసుకున్న తర్వాతే ఈ అరుదైన చిత్రాలను పంచుకున్నట్లు ఫన్నీగా రాశాడు.

4 / 5

AI టూల్ మిడ్‌జర్నీ సహాయంతో ఈ చిత్రాలను రూపొందించినట్లు సృష్టికర్త జాన్ ముల్లూర్ తెలిపారు. పిరమిడ్ నిర్మాణం ఛాయాచిత్రాలను తయారు చేయమని కొంతమంది ఇప్పుడు జాన్ ముల్లూర్‌కు విజ్ఞప్తి చేశారు.

5 / 5
Follow us