చంద్రునికి ఒకవైపు రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు ఉండగా.. మరోవైపు దక్షిణ ధృవంలో భారత్ మాత్రమే ఉంది. దక్షిణ ధృవాన్ని చేరుకోవడం ఒక పెద్ద సవాలు.. దీనిని భారతదేశం పూర్తి చేసింది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అవడంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజలు పటాకులు పేల్చి దేశం సాధించిన విజయానికి హర్షం వ్యక్తం చేశారు.