ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి. కోచి వాటర్ మెట్రో సర్వీస్‌లో టికెట్ ప్రారంభ ధర 20 కాగా, గరిష్ఠ టికెట్ ఖరీదు 40 రూపాయలు.