నిజానికి పాక్ విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాలి. కానీ, పాకిస్థాన్‌కు వికెట్లు దక్కలేదు. ఇప్పటికే ఆ జట్టు 8 వికెట్లు పడిపోయాయి. అలాగే, చివర్లో బౌలర్లు క్రీజులో ఉండడంతో ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్ కు అనుకూలంగా మారడం ఖాయమనిపించింది. చివరి ఓవర్ బౌలింగ్ బాధ్యతను ఫజ్లక్ ఫరూఖీ తీసుకున్నాడు. ఈసారి నసీమ్ షా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఓవర్ తొలి బంతిని వేయడానికి వచ్చిన ఫరూఖీ.. తన తెలివైన ఎత్తుగడతో షాదాబ్‌ను రనౌట్ చేశాడు.