Watch ! మొసలి నోటికి చిక్కిన నదిలో స్నానం చేస్తున్న మహిళ.. గూడు కట్టి గుడ్లు పెట్టె సమయం.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

భయంకరమైన సంఘటన ఒడిశాలోని జాజ్‌పూర్‌లో జరిగింది. బుధవారం ఇక్కడ ఉన్న పలాత్‌పూర్ గ్రామంలో స్నానం చేసేందుకు ఓ మహిళ బీరుపా నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా పెద్ద మొసలి ఆమెపై దాడి చేసింది. మహిళను మొసలి నోట కరుచుకుని..  ఈడ్చుకెళ్లి నేలపై పడవేస్తున్నది ఈ  వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. మొసలి ఆ స్త్రీని తన దవడలతో నొక్కి పట్టి.. పైకి లేపి గాలిలోకి విసిరి లోతైన నీటిలోకి తీసుకెళ్లింది.

Follow us
Surya Kala

|

Updated on: Aug 17, 2023 | 10:18 AM

నదిలో ఓ మహిళ స్నానం చేస్తుండగా మొసలినోటికి చిక్కి దానికి ఆహారం అయిన హృదయ విదారక వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. నది మధ్యలో ఓ మహిళ మృతదేహాన్ని నమిలేస్తున్న మొసలి కనిపించింది. ఈ దారుణ ఘటన జరుగుతున్న సమయంలో అటువైపు నిల్చున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. మొసలి దాడి జరిగిన గంట తర్వాత మహిళ మృతదేహం లభ్యమైంది.

సమాచారం ప్రకారం ఈ భయంకరమైన సంఘటన ఒడిశాలోని జాజ్‌పూర్‌లో జరిగింది. బుధవారం ఇక్కడ ఉన్న పలాత్‌పూర్ గ్రామంలో స్నానం చేసేందుకు ఓ మహిళ బీరుపా నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా పెద్ద మొసలి ఆమెపై దాడి చేసింది. మహిళను మొసలి నోట కరుచుకుని..  ఈడ్చుకెళ్లి నేలపై పడవేస్తున్నది ఈ  వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. మొసలి ఆ స్త్రీని తన దవడలతో నొక్కి పట్టి.. పైకి లేపి గాలిలోకి విసిరి లోతైన నీటిలోకి తీసుకెళ్లింది.

మహిళను గాలిలోకి విసిరిన మొసలి

మృతి చెందిన మహిళను 35 ఏళ్ల జ్యోత్స్నా రాణిగా గుర్తించారు. ఆమె రోజూ స్నానం చేయడానికి నదికి వెళ్లేది. మొసలి రాణిని తీసుకుని వెళ్తున్న సమయంలో ఆమె బాధ వర్ణాతీతం అనిపిస్తుంది చూసిన వారికి. హృదయాన్ని కదిలిస్తున్న ఈ  వీడియో నదికి అవతలి వైపు నిలబడి ఉన్నవారు తమ సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వరసగా హింసాత్మక ఘటనలు

ఇంతకు ముందు కూడా జూన్ నెలలో రెండుసార్లు మొసలి దాడి చేసిన వార్తలు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ సమయంలో మొసళ్ల బెడద ఎక్కువగా ఉంటుందని.. గూడు కట్టుకుని గుడ్లు పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయని.. కనుక ఎవరైనా వాటి ప్రాంతానికి వెళ్తే.. హింసాత్మకంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..