Viral News: వార్నీ.. ఇదేక్కడి విడ్డూరం..! పనసపండ్లు ఇలా కాస్తాయా..? చూసేందుకు ఎగబడుతన్న జనాలు..

తోటలో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయం జరగటం అందిరికీ ఆసక్తిని కలిగిస్తుంది. మొత్తానికి ఇది ప్రకృతి అద్భుతమా..? లేక చెట్టులో అసాధారణంగా వచ్చిన ఎదుగుదలా అర్థం కాలేదన్నారు తోట యజమాని.

Viral News: వార్నీ.. ఇదేక్కడి విడ్డూరం..! పనసపండ్లు ఇలా కాస్తాయా..? చూసేందుకు ఎగబడుతన్న జనాలు..
Cashew Shaped Jackfruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2023 | 3:12 PM

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో అద్భుతాలకు నిలయం. అనేక అరుదైన సంఘటనలకు నెలవు. వింతలు విచిత్రాలకు ఈ భూమిపై పరిమితి అంటూ ఉండదనే చెప్పాలి. ఈ మాట ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటనే మరోకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పనస చెట్టు కాయలు వింతగా, అందరూ ఆశ్చర్యపోయేలా కనిపించాయి. ఆ చెట్టు కాయలు చూసిన ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది ప్రకృతి అద్భుతం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని మహాబలేశ్వర్ బండికట్టె పెరటి తోటలోని ఒక పనస చెట్టుకు విచిత్రంగా జీడిపప్పు ఆకారంలో జాక్‌ప్రూట్స్‌ కనిపించాయి. ఈ నేచురల్ ఫీచర్‌ని చూసి జనాలు అవాక్కవుతున్నారు. పనస చెట్టుకు జీడిపప్పు కాసిన సంఘటన వెలుగులోకి రావటంతో ఉత్సుకతతో జనం పరుగులు తీయడం ఆశ్చర్యం కలిగించింది.

ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా బండికట్టె అనే గ్రామంలో ఈ దృగ్విషయం చోటుచేసుకుంది. మహాబలేశ్వర్ అనే రైతు ఇంటి పెరట్లో సుమారు 70 ఏళ్లుగా ఉన్న జాక్‌ఫ్రూట్ చెట్టులో అలాంటి ప్రకృతి వింత వెలుగులోకి వచ్చింది. ఏటా నడుము ఎత్తు పనస పండే చెట్టు ఈ ఏడాదే తెగినట్లు అనిపించడం, పనస చెట్టులో జీడిపప్పు పెరగడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో ఊరంతా అతని పెరట్లోకి వచ్చి చెట్టు, పండ్లను ఉత్సుకతతో చూస్తున్నారు. జాక్‌ఫ్రూట్ చెట్టుపై పనస పండుతుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిని తొలిచేస్తుంది.

కానీ, దీని వెనుక మిస్టరీ ఎంటన్నది మాత్రం తెలియరాలేదు. అయితే ఇది దాదాపు 70 ఏళ్లనాటి జాక్‌ఫ్రూట్ చెట్టు. ఇలాంటి అద్భుతం కనిపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆముదం లాంటి కాయలా ఉన్న జాక్‌ఫ్రూట్‌ను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మహాబలేశ్వర్ తోటలో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయం జరగటం అందిరికీ ఆసక్తిని కలిగిస్తుంది. మొత్తానికి ఇది ప్రకృతి అద్భుతమా..? లేక చెట్టులో అసాధారణంగా వచ్చిన ఎదుగుదలా అర్థం కాలేదన్నారు తోట యజమాని.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..