ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. హైదరాబాద్, ఢిల్లీ పేలుళ్ల కోసం రెక్కీ నిర్వహించారంటూ..

Indian Mujaheddin: దేశ వ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్‍‌కి నలుగురు తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు రెక్కీ నిర్వహించారని జాతీయ దర్యాప్తు సంస్థ..

ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. హైదరాబాద్, ఢిల్లీ పేలుళ్ల కోసం రెక్కీ నిర్వహించారంటూ..
Indian Mujahideen
Follow us

|

Updated on: Jul 13, 2023 | 12:08 PM

Indian Mujaheddin: దేశ వ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్‍‌కి నలుగురు తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు రెక్కీ నిర్వహించారని జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన వాదనలతో సదరు కోర్టు ఏకీభవించింది. పేలుళ్ల కోసం నిందితులు ఆయుధాలు, ఆయుధ సమాగ్రిని సైతం సమకూర్చుకున్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన ఒబేద్ రహమాన్, బీహార్‌కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలమ్‌, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్‌‌ని పేలుళ్ల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ 2013 మార్చిలో అరెస్ట్‌ చేసింది. జులై 7న వీరిని దోషులుగా నిర్ధారించిన ఎన్ఐఏ కోర్టు.. గురువారం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక డానిష్ అన్సారీకి రూ. 2,000, అఫ్తాబ్ ఆలమ్‌కు రూ. 10,000 జరిమానాను కూడా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి శైలేందర్ మాలిక్ తీర్పునిచ్చారు.

ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలోని పలు చోట్ల పేలుళ్లకు ఈ నలుగురు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2007లో జరిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లు.. అలాగే 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో వీరి పాత్ర ఉందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇవే కాక గతంలో వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్‌లో జరిగిన పేలుళ్లలోనూ ఈ నలుగురి పాత్ర ఉందని తెలిపింది. అయితే ఈ కేసులలో మొత్తం 11మంది నిందితులుగా ఉండగా.. మిగిలిన ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా, జైలు శిక్షను పొందిన నలుగురు దోషులపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో జాతీయ దర్యప్తు సంస్థ సంచలన విషయాలు పొందుపరిచింది. పాకిస్థాన్‌కు చెందిన కీలక నిందితులు రియాజ్ భత్కల్, భారత్‌కు చెందిన యాసిన్ భత్కల్‌‌తో సహా ఇండియన్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులతో వీరు చాలా సన్నిహతంగా ఉన్నారని ఎన్ఐఏ వెల్లడించింది. ఇంకా ఈ నలుగురు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టులో వాదించింది. వీరికి మరి కొందరు ఉగ్రవాదులతోనూ సంబంధాలు ఉన్నాయని వివరించగా.. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు ఐపీసీ 121ఏ, 123 సెక్షన్ల ప్రకారం, ఇంకా ఉపా చట్టంలోని సెక్షన్ 17, సెక్షన్ 18, సెక్షన్ 18ఏ, సెక్షన్ 18బి, సెక్షన్ 20లను అనుసరించి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..