దారుణం.. రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళకు నిప్పంటించిన దుండగుడు.. ముగ్గురు దుర్మరణం..

కేరళలో దారుణం చోటుచేసుకుంది. అలప్పుజ కన్నూర్​ ఎక్స్​ప్రెస్‌లోని డీ1 కంపార్ట్​మెంట్​లో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ.. ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. గొడవ అనంతరం చివరికి.. కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి, తోటి ప్యాసింజర్​పై పెట్రోల్ పోశాడు.

దారుణం.. రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళకు నిప్పంటించిన దుండగుడు.. ముగ్గురు దుర్మరణం..
Fire In Train
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 03, 2023 | 8:40 AM

కేరళలో దారుణం చోటుచేసుకుంది. అలప్పుజ కన్నూర్​ ఎక్స్​ప్రెస్‌లోని డీ1 కంపార్ట్​మెంట్​లో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ.. ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. గొడవ అనంతరం చివరికి.. కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి, తోటి ప్యాసింజర్​పై పెట్రోల్ పోశాడు. అనంతరం ప్యాసింజర్​కు నిప్పంటించాడు. కొద్ది క్షణాల తర్వాత.. ట్రైన్​చెయిన్​లాగి, అక్కడి నుంచి పారిపోయాడు. రైలు కన్నూర్​ చేరుకునేసరికి ప్రయాణికుల్లో ముగ్గురు కనిపించడం లేదని తోటి ప్యాసింజర్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ట్రాక్​లను పరిశీలించడం మొదలుపెట్టారు పోలీసులు. ఇంతలో వారికి మూడు మృతదేహాలు కనిపించాయి. మహిళ, మరో వ్యక్తి, ఏడాది చిన్నారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోజికోడ్‌లోని ఎలత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది

రైలులో మంటలు చూసిన వీరు.. బయటపడేందుకు రైలు నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన మహిళ ఎవరు? నిప్పంటించిన దుండగుడు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

అలప్పుజ-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటనలో 8మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిని కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మంటలు చెలరేగిన డీ1 కంపార్ట్‌మెంట్‌ బ్రిడ్జి పైన ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..