కన్నడిగులు ముందే ఫిక్స్ అయ్యారు.. విజయ ఢంకా మోగించేది మేమేః కుమారస్వామి

HD Kumaraswamy: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జనతాదళ్ (ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు.

కన్నడిగులు ముందే ఫిక్స్ అయ్యారు.. విజయ ఢంకా మోగించేది మేమేః కుమారస్వామి
Kumaraswmy
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 29, 2023 | 7:17 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జనతాదళ్ (ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) విజయ ఢంకా మోగించబోతున్నారు. ఇకపై కర్ణాటకలో జాతీయ పార్టీలకు స్థానం చెల్లిందన్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌, బీజేపీ అసమర్థ పాలనతో కన్నడ ప్రజలు విసుగు చెందారని ఆయన అన్నారు. తామ పార్టీ ఎవరికి బీ టీమ్‌ కాదని, కన్నడిగులకు బీ టీమ్‌ అని కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు తమకు భారీ మెజారిటీ గెలిపించబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 13న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఏప్రిల్‌ 20 వరకు నామినేషన్‌ల స్వీకరణకు గడువు నిర్ణయించింది ఈసీ. మే 10న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించి, మే 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం