ఉబర్ లో బగ్ ను కనిపెట్టాడు. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్నాడు
కొన్ని ప్రముఖ కంపెనీల్లో ఉన్న బగ్ లను కనిపెట్టి ఆ సంస్థల నుంచి కొంతమంది హ్యకర్లు లేదా సాఫ్ట్ వేర్ నిపుణులు భారీ నగదును అందుకుంటారు. తాజాగా ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
కొన్ని ప్రముఖ కంపెనీల్లో ఉన్న బగ్ లను కనిపెట్టి ఆ సంస్థల నుంచి కొంతమంది హ్యకర్లు లేదా సాఫ్ట్ వేర్ నిపుణులు భారీ నగదును అందుకుంటారు. తాజాగా ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అదికూడా మన ఇండియాలోనే. ఇక వివరాల్లోకి వెళ్తే ఊబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనుకునే చోటుకి వేగంగా వెళ్లాలనుకునేవారికి ఈ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఈ యాప్ లో ఆ కంపెనీ కూడా గుర్తించని ఓ బగ్ ని ఇండియాకి చెందిన ఆనంద్ ప్రకాశ్ అనే ఎథికల్ హ్యకర్ కనిపెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. ఇంకేముంది అతనికి కంపెనీ రూ. 4.5 లక్షల భారీ నజరానా అందించింది.
అయితే ఈ ఉబర్ లో కనిపించిన బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఉచితంగానే రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. దీంతో కంపెనీ ఎక్కవ నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. చివరకి ఆనంద్ ప్రకాశ్ దాన్ని కనిపెట్టడంతో ప్రమాదం తప్పింది. అయితే అతను ఈ బగ్ గురించి చెప్పేవరకు ఆ కంపెనీ కూడా గుర్తించకపోవడం గమనార్హం. 2017లో కనుగొనగా..2019లో దీని గురించి కంపెనీకి వివరించాడు. కంపెనీకే తెలియని విషయాన్ని కనిపెట్టినందుకు ఆనంద్ ప్రకాశ్ కు జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశాన్ని కూడా కల్పించింది ఉబర్. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి లింక్డిన్ పోస్ట్ ద్వారా వివరించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి