UPI Payments: వినియోగదారుడిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.. యూపీఐ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌పీసీఐ
ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ఎన్‌పీసీఐ స్పష్టత ఇచ్చింది.
యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌పీసీఏ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు లావాదేవీలు జరిపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐ తెలిపింది. దేశంలో అత్యధికంగా 99.9 శాతం UPI లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నాయని ఎన్‌పీసీఏ తన ప్రకటనలో తెలిపింది.
UPI చెల్లింపు కోసం బ్యాంక్ లేదా కస్టమర్ ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఏ తెలిపింది. అలాగే, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు యూపీఏ లావాదేవీ జరిగినా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI వాలెట్‌లు) ఇప్పుడు ఇంటర్‌ఆపరబుల్ UPI ఎకోసిస్టమ్‌లో భాగమని ఎన్‌పీసీఏ తెలిపింది.
దీని దృష్ట్యా, ఇంటర్‌ఆపరబుల్ యూపీఏ పర్యావరణ వ్యవస్థలో భాగంగా PPI వాలెట్‌లను ఎన్‌పీసీఏ అనుమతించింది. ఇంటర్‌చేంజ్ ఛార్జీ PPI వ్యాపార లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల వ్యాపారి లావాదేవీలు). దీని కోసం కస్టమర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇక్కడ చదవండి..
NPCI Press Release: UPI is free, fast, secure and seamless Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U
— NPCI (@NPCI_NPCI) March 29, 2023
NPCI సర్క్యులర్ ప్రకారం, Google Pay, Paytm, PhonePe లేదా ఇతర యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులపై గరిష్టంగా 1.1 శాతం ఇంటర్‌చేంజ్ రేటు చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది.
ఇదే అంశంపై పేటీఎం అందించిన సమాచారం..
Please be informed that Paytm UPI is free, fast, secure, and seamless. No customer will pay any charges on making payments from UPI either from bank account or PPI/Paytm Wallet. Please read the @NPCI_NPCI press release to get more clarity on the issue. https://t.co/GM49FoZydA
— Paytm (@Paytm) March 29, 2023
యూపీఐ ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు చెల్లింపు చేసినా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐ తన వివరణలో పేర్కొంది. దీనితో పాటు, యూపీఏ ఆధారిత యాప్‌లలో బ్యాంక్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్ తెరవడానికి కస్టమర్ ఎంపికను కలిగి ఉంటారు. మీరు ప్రీపెయిడ్ వాలెట్లను ఉపయోగించవచ్చు. యూపీఏ ప్రకారం, దేశంలోని కస్టమర్‌లు, వ్యాపారులకు ప్రతి నెల 8 బిలియన్ల యూపీఏ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ప్రాసెస్ చేయబడతాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం