Coronavirus: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. మాక్ డ్రిల్స్ నిర్వహించండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన
అప్రమత్తంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవ్య సూచించారు. కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ రాష్ట్రాల్లోని ఆరోగ్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆరోగ్య మంత్రులందరినీ ఆయన అభ్యర్థించారు.
దేశంలో మరోసారి కరోనా రక్కసి కోరలు చాస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. కరోనా కేసులు పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా నిర్ధరణ పరీక్షలు పెంచాలని మాండవీయ కోరారు. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 10, 11వ తేదీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు మాక్ డ్రిల్స్ నిర్వహించే ఆస్పత్రులకు వెళ్లాలని అన్నారు. ఎమర్జెన్సీ హాట్‌స్పాట్లను గుర్తించాలని.. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్లను అందించాలని.. మరింతగా పెంచాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో ఓసారి మంత్రులు చూడాలని మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు.
అప్రమత్తంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవ్య సూచించారు. కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ రాష్ట్రాల్లోని ఆరోగ్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆరోగ్య మంత్రులందరినీ ఆయన అభ్యర్థించారు.
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా సన్నాహాలను వారి స్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పెరుగుతున్న కరోనా కేసులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు అలసత్వం వహించవద్దని ఆయన అన్నారు.
Chaired a meeting to review COVID-19 situation with the Health Ministers of the States & Union Territories. Stressed on increasing covid testing & genome sequencing along with following COVID appropriate behaviour.
We have to be alert & avoid spreading any unnecessary fear. https://t.co/VdHazObxTS
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 7, 2023
భారీగా పెరిగిన కేసులు..
203 రోజుల తర్వాత దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులకు చేరింది. కరోనా రక్కసి వల్ల 14 మంది మరణించారు. గురువారంతో పోలిస్తే.. ఏడు వందలకు పైగా కేసులు పెరిగాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 6 నాటి కరోనా కేసుల నివేదిక ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గత 195 రోజుల్లో అత్యధికం. అంతకుముందు గతేడాది సెప్టెంబర్ 23న 5,383 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి చేరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం