సుధామూర్తికి పద్మభూషణ్ రావడంపై స్పందించిన యూకే ప్రధాని.. గర్వించదగ్గ రోజు అంటూ అత్తపై అల్లుడు ప్రశంసలు.
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విద్యావేత్త, రచయితతో పాటు గొప్ప మానవతామూర్తిగా ఆమె పేరు సంపాదించుకున్నారు. సామాజిక సేవ, దాదృత్వ కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న...
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విద్యావేత్త, రచయితతో పాటు గొప్ప మానవతామూర్తిగా ఆమె పేరు సంపాదించుకున్నారు. సామాజిక సేవ, దాదృత్వ కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుధామూర్తికి భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ వరించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఆమె పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి సుధామూర్తి కూతురు అక్షతామూర్తి సైతం హాజరయ్యారు. తల్లికి పద్మహూషణ్ రావడంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషణ్‌ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వపడ్డాను. సమాజం కోసం ఆమె చేసిన సేవకు ఈ పురస్కారాన్ని పొందారు. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. గుర్తింపు కోసం ఆమె ఎప్పుడూ చూడరు. కానీ, నిన్న పొందిన గుర్తింపు గొప్ప అనుభూతినిచ్చింది’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఈ పోస్ట్ పోస్ట్‌పై సుధామూర్తి అల్లుడు, యూకే ప్రధాని రిషి సునాక్ స్పందించారు. భార్య అక్షతామూర్తి చేసిన పోస్టుకు.. ‘గర్వించదగ్గ రోజు’అంటూ కామెంట్ చేశారు.
View this post on Instagram
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టంట వైరల్ అవుతోంది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. గతేడాది రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన విషయ తెలిసిందే.
Akshata Murty is spotted in India. https://t.co/oBtg8E6BMB pic.twitter.com/MJNQVqg4Ne
— Darween Vasudev (@darweenvasudev) April 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..