India Covid-19: మళ్లీ కరోనా డేంజర్ బెల్స్‌.. దేశంలో 10వేలకు పైగా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్నంటే..

కరోనా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరీక్షలు పెంచడంతోపాటు.. సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని.. మాస్కులు ధరించాలని సూచించింది.

India Covid-19: మళ్లీ కరోనా డేంజర్ బెల్స్‌.. దేశంలో 10వేలకు పైగా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్నంటే..
Covid19
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 27, 2023 | 1:40 PM

కరోనా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరీక్షలు పెంచడంతోపాటు.. సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని.. మాస్కులు ధరించాలని సూచించింది. కాగా.. దేశంలో కరోనా కేసులు వరుసగా రెండోరోజు 18వందలకు పైనే నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య పది వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 10వేల 300 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దేశంలో 2020 ఏప్రిల్‌ తర్వాత 2022 నవంబర్‌లో యాక్టివ్‌ కేసులు పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడం ఇదే ప్రథమం.దేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ దిశానిర్దేశం చేయనుంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..