Karnataka Congress: కర్ణాటకలో ఎన్నికల వేడి.. 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్..

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

Karnataka Congress: కర్ణాటకలో ఎన్నికల వేడి.. 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్..
Karnataka Congress
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 25, 2023 | 12:03 PM

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలకు షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్.. తాజాగా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ 124 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్‌ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

కాగా.. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. దీంతో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను చేస్తోంది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకున్నాయి. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు దక్కించుకోగా.. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు.

ఇవి కూడా చదవండి

2019లో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారును చేసింది.. ఆ తర్వాత కొన్ని రోజులకే కూటమిలో సంక్షోభం తలెత్తడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..