కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బంగ్లాలో కాలేజ్‌ స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌కు చెందిన బంగ్లాలో ఓ కాలేజీ విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం....

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బంగ్లాలో కాలేజ్‌ స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?
College Student Committed Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2022 | 3:21 PM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌కు చెందిన బంగ్లాలో ఓ కాలేజీ విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం..

భోపాల్‌లోని శ్యామల హెల్స్‌ ప్రాంతంలో ఎమ్మెల్యే ఓంకార్‌ భవనంలో తిరాథ్‌ సింగ్‌ అనే విద్యార్ధి నివాసం ఉంటూ గత నాలుగేళ్లుగా చదువుకుంటున్నాడు. ఐతే తిరాథ్‌ సింగ్‌ కొన్నెళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అతనితోపాటు ఆదే బంగ్లాలో ఉంటున్న మరో వ్యక్తి తెలిపాడు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో క్యాన్సర్‌ కారణంగానే విద్యార్ధి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్‌ నోట్‌ సైతం లభ్యమైంది. మృతుడి చేతి రాత, సూసైడ్‌ నోట్‌లోని రాత రెండూ ఒకటేనా.. లేక వేరువేరా అనే కోణంగా పరిశీలించేందుకు సూసైడ్ నోట్‌ను హ్యాండ్‌రైటింగ్‌ నిపుణులకు పంపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధి మృతికి గల కారణాలను అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఉమేష్ యాదవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.