Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (63) అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌..ఆస్పత్రిలో

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..
Nirmala Sitharaman
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2022 | 2:45 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. నిర్మలా సీతారామన్‌ ఆదివారం మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఐతే.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఫిబ్రవరి 1, 2023న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. నవంబర్ 21-28 వరకు వర్చువల్ మోడ్‌లో జరిగిన 2023-24 బడ్జెట్ ప్రీ-బడ్జెట్ సమావేశాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.