Chandrayaan-3: చందమామ ఫొటోలు చూశారా..? ఇస్రో కేంద్రానికి జాబిల్లి క్లోజప్ చిత్రాలు..

Chandrayaan-3 Photos: చంద్రయాన్‌-3.. చందమామపై అలా అడుగు పెట్టిందోలేదో విక్రమ్‌ ల్యాండర్‌ వెంటనే పనిమొదలుపెట్టేసింది!. చంద్రుడి క్లోజప్ ఫొటోలతోపాటు జాబిల్లిపై ల్యాండ్‌ అవుతున్నప్పటి చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది. దక్షిణ ధృవం మొత్తం నాలుగు ఫొటోలను బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సెండ్‌ చేసింది.

Follow us

|

Updated on: Aug 24, 2023 | 11:05 AM

Chandrayaan-3 Photos: చంద్రయాన్‌-3.. చందమామపై అలా అడుగు పెట్టిందోలేదో విక్రమ్‌ ల్యాండర్‌ వెంటనే పనిమొదలుపెట్టేసింది!. చంద్రుడి క్లోజప్ ఫొటోలతోపాటు జాబిల్లిపై ల్యాండ్‌ అవుతున్నప్పటి చిత్రాలను విక్రమ్ ల్యాండర్ తీసి పంపింది. దక్షిణ ధృవం మొత్తం నాలుగు ఫొటోలను బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి సెండ్‌ చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ పంపిన ఫొటోలను మీడియాకి రిలీజ్‌ చేసింది ఇస్రో. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయ్‌!. చంద్రుడిపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో 6కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసింది ల్యాండర్‌. ల్యాండైన తర్వాత కూడా మరికొన్ని చిత్రాలను పంపింది విక్రమ్‌ ల్యాండర్‌. ఈ ఫొటోలన్నీ బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉన్నాయి. మొత్తం 14రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది విక్రమ్‌ ల్యాండర్‌.

దక్షిణ ధృవంలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన క్లియర్‌ పిక్చర్స్‌ను తీయనుంది రోవర్‌. చందమామపై వాతావరణం ఎలా ఉంది?, మంచు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయ్‌?, అక్కడి వాతావరణం మానవ మనుగడకు అనుకూలమా? కాదా?, ఇలా అనేక అంశాలపై అధ్యయనంచేసి ఎప్పటికప్పుడు ఫొటోలు పంపనుంది.

ఇవి కూడా చదవండి

చంద్రయాన్‌-3 సక్సెస్‌తో మీసం మెలేసింది భారత్‌!. మూన్‌ సౌత్‌ పోల్‌పై ల్యాండర్‌ను దింపి… అమెరికా, రష్యా, చైనాకు సవాల్‌ విసిరింది. చంద్రయాన్‌-3ని సూపర్‌ సక్సెస్‌చేసి నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు ఇండియా వైపు చూసేలా చేసింది ఇస్రో. కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ దక్షిణ ధృవం నుంచి నిరంతరాయంగా పనిచేస్తూ.. అక్కడి సమాచారాన్ని చేరవేయనుంది.

అభినందించిన అమిత్ షా..

చంద్రయాన్‌-3 టీమ్‌ను అభినందించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. అంతరిక్షరంగంలో అద్భుత విజయం సాధించారని కొనియాడారు. చంద్రయాన్‌-3 సక్సెస్‌తో ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూసిందన్నారు అమిత్‌షా. ఈ అద్భుత విజయాలకు ప్రధాని మోదీ తీసుకొచ్చిన నూతన స్పేస్‌ పాలసీ కూడా కారణమన్నారు కేంద్ర హోంమంత్రి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..