Watch Video: నదిలో చిక్కుకున్న బస్సు.. జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన యూపీ అధికారులు

Bus gets Stuck in River: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ దగ్గర నదీ ప్రవాహంలో చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కోటావళి నదిలో చిక్కుకున్న యాత్రికులను జేసీబీల సాయంతో బయటకు తీసుకొచ్చారు.

Watch Video: నదిలో చిక్కుకున్న బస్సు.. జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన యూపీ అధికారులు
Bus
Follow us

|

Updated on: Jul 22, 2023 | 4:23 PM

Flash Floods: ఉత్తరాదిలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్ నుంచి మొదలుపెడితే యూపీ వరకు నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ దగ్గర నదీ ప్రవాహంలో చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కోటావళి నదిలో చిక్కుకున్న యాత్రికులను జేసీబీల సాయంతో బయటకు తీసుకొచ్చారు. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లను చాలా చాకచక్యంగా రక్షించారు అధికారులు. యూపీకి చెందిన భక్తులు ఛార్‌ధామ్‌ యాత్రకు వెళ్తుండగా నదీప్రవాహంలో వాళ్ల బస్సు చిక్కుకుంది. కోటావళి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. అయితే డ్రైవర్‌కు ఆ సమాచార లేకపోవడంతో ముందుకెళ్లాడు.

యూపీలో గంగానదితో పాటు ఉపనదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్లు రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో కొత్వాలి నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో నది నీరు హరిద్వార్ రోడ్డుపైకి చేరింది. హరిద్వార్ రోడ్డుపైకి నీరు రావడంతో రోడ్డు మార్గం బస్సు అందులో ఇరుక్కుపోయింది. డ్రైవర్ నీటిని ఊహించలేక బస్సును ముందుకు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వరద ప్రవాహంలో బస్సు ఇరుక్కుపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో తోపులాట జరిగింది. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. కొంత మంది ప్రయాణికులు బస్‌ పైకప్పుపై నుంచి తమను రక్షించాలంటూ కేకలు వేయడం మొదలు పెట్టారు.

విషయం తెలుసుకున్న యూపీ అధికారులు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగారు. బ్రిడ్జి పైన క్రేన్‌ను అమర్చి బస్సు బోల్తా పడకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడేందుకు మండవాలి పోలీస్‌స్టేషన్‌ పోలీసులు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాయి.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు బిజ్నోర్‌కు చెందిన రెస్క్యూ టీమ్ ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్ హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ రెస్క్యూ టీం సగానికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రయాణికులందరినీ అధికారులు జేసీబీ యంత్రం ద్వారా బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. జేసీబీ యంత్రం ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ప్రాణనష్టం జరిగిందన్న వెల్లడించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం