Watch Video:పుదిచ్చేరిలో దారుణం.. బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు
కేంద్రపాలిత ప్రాంతం పుదిచ్చే్రిలలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు బీజేపీ నేతను నరికి చంపేశారు. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్ ఆదివారం రాత్రి విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ బేకరీలో టీ తాగుతున్నాడు.
కేంద్రపాలిత ప్రాంతం పుదిచ్చే్రిలలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు బీజేపీ నేతను నరికి చంపేశారు. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్ ఆదివారం రాత్రి విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ బేకరీలో టీ తాగుతున్నాడు. ఇంతలోనే ఏడుగురు దుండగులు బైకులపై అక్కడికి వచ్చారు. మొదటగా ఓ వ్యక్తి నాటు బాంబులను సెంథిల్ పై విసిరాడు. దీంతో సెంథిల్ అక్కడే కిందపడిపోయాడు. దీంతో ఈ దుండగులు కర్రలు, కత్తులతో దాడి చేసి నరికి చంపారు. అనంతంరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
మరోవైపు సెంథిల్ కుమార్ హత్య విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి ఏ నమశ్శివాయం, బంధువులు, సుమారు700 మంది బీజేపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. చనిపోయిన సెంథిల్‌ను చూసి హోంమంత్రి నమశ్శివాయం, బంధువులు బోరున విలపించారు. పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. సెంథిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలించారు. సోమవారం రోజున ఆ ఏడుగురు నిందితులు ట్రిచీ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
पुदुचेरी में हमलावरों ने की भाजपा नेता की हत्या। हमलावरों ने सेंथिल कुमार पर देशी बम फेंके और बाद में चाकू मारकर मार डाला।#puducherry #BJP pic.twitter.com/kyHBTFJr3p
— Pranjal (@Pranjaltweets_) March 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..