రైల్వే స్టేషన్‌లో అమ్మాయిల మృతదేహాల కలకలం.. 4 నెలల్లో మూడు హత్యలు..

రైల్వే స్టేషన్‌ గేటు వద్ద డ్రమ్ములో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్ ప్రధాన గేటు వద్ద పడి ఉన్న..

రైల్వే స్టేషన్‌లో అమ్మాయిల మృతదేహాల కలకలం.. 4 నెలల్లో మూడు హత్యలు..
Bengaluru Serial Killer
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2023 | 5:01 PM

బెంగళూరులోని రైల్వే స్టేషన్‌ గేటు వద్ద డ్రమ్ములో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్ ప్రధాన గేటు వద్ద పడి ఉన్న డ్రమ్ములో మహిళ మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలి వయసు 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్) ఎస్కే సౌమ్యలత తెలిపారు. ఐతే మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా గత ఏడాది చివరి నుంచి బెంగళూరులో ఇదే విధమైన హత్యోదంతాలు ఇప్పటికే రెండు నమోదయ్యాయి.

గత ఏడాది డిసెంబర్ నెల రెండో వారంలో ఎస్‌ఎమ్‌వీటీ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్యాసింజర్ రైలు కోచ్‌లో ఉన్న సామాను సంచుల్లో నుంచి దుర్వాసన రావడంతో ఓ ప్రయాణికుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తనిఖీ చేయగా వాటిల్లో పసుపు గోనె సంచెలో కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 4న యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫారమ్‌పై నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుళ్ళిపోయిన యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మచిలీపట్నం నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్‌లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఐతే ఈ మూడు సంఘటనలకు ఏదైనా సంబంధం ఉందా..? మృత దేహాలన్నీ మహిళలవే కావడం, కుళ్లిపోయిన స్థితిలో లభ్యంకావడం వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడా.. అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.