IRCTC Package: రెండు రోజుల్లో తిరుపతి సహా ఐదు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే వీలుకల్పిస్తున్న ఐఆర్‌సీటీసీ.. పూర్తి వివరాలు మీ కోసం..

ఐఆర్‌సీటీసీ టూరిజమ్ శాఖ శ్రీవారి భక్తులకు అతి తక్కువ ధరతో తిరుమల తిరుపతి వెళ్లే వీలుకల్పిస్తుంది.  సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ పేరుతో స్పెషల్  ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమల శీవారి దర్శనంతో పాటు.. శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ , కాణిపాకం, శ్రీకాళహస్తి ని సందర్శించే వీలు కల్పిస్తుంది. 

IRCTC Package: రెండు రోజుల్లో తిరుపతి సహా ఐదు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే వీలుకల్పిస్తున్న ఐఆర్‌సీటీసీ.. పూర్తి వివరాలు మీ కోసం..
Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2023 | 9:50 AM

కలియుగ వైకుంఠంగా ఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ప్రతి రోజూ భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే భక్తులకు శ్రీవారి దర్శనం సులభంగా చేసుకునే సౌకర్యాన్ని కలిపిస్తూ.. తిరుమల వెళ్లాలనుకునేవారికి ఐఆర్​సీటీసీ టూరిజం గుడ్​న్యూస్ చెప్పింది. స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆ ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఐఆర్‌సీటీసీ టూరిజమ్ శాఖ శ్రీవారి భక్తులకు అతి తక్కువ ధరతో తిరుమల తిరుపతి వెళ్లే వీలుకల్పిస్తుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ పేరుతో స్పెషల్  ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమల శీవారి దర్శనంతో పాటు.. శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ , కాణిపాకం, శ్రీకాళహస్తి ని సందర్శించే వీలు కల్పిస్తుంది.

ఈ ప్యాకేజీ వారంలో రెండు రోజులు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి మంగళవారం, గురువారం ఉండనుంది. హైదరాబాద్ నుంచి విమానంలో  రేణి గుంటకు చేరుకొని అక్కడ నుంచి తిరుపతికి చేరుకోవాలి. బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్ స్పెషల్ టూర్ ఒక రాత్రి రెండు పగళ్లు ఉండనుంది.

ఇవి కూడా చదవండి

పర్యటన ఎలా సాగుతుందంటే..

పర్యటనలో మొదటి రోజు.. ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి  బయలుదేరి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి. ఈ రోజునే శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు సాయంత్రానికి తిరుపతికి తిరిగి వచ్చి..హోటల్ లో బస చేయాలి. రాత్రి డిన్నర్ చేసి నిద్రపోవాలి.

రెండో రోజు: సెకండ్ డే ఉదయమే టిఫిన్ తిని.. శ్రీవారి దర్శనం కోసం బయలు దేరాలి. కొండపైకి చేరుకున్న తర్వాత.. స్వామివారిని స్పెషల్ ఎంట్రీలో వెళ్లి దర్శనం చేసుకోవాలి. వెంకన్న దర్శనం అనంతరం.. తిరిగి హోటల్ కు చేరుకుని హోటల్ లో లంచ్ చేయాలి.  అనంతరం హోటల్ లో చెక్ ఔట్ చేసి అక్కడ నుంచి శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. కాళహస్తీశ్వరుడు దర్శించుకున్న తర్వాత తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలి. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకోవాలి. పర్యటనలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి స్టార్ట్ అయింది మొదలు. తిరిగి తిరుపతి ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేవరకూ ఐఆర్‌సీటీసీ సిబ్బంది అని సౌకర్యాలను కల్పిస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు:

హోటల్ సిగింల్ షేరింగ్: రూ. 16,330

డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 14,645

ట్రిపుల్ షేరింగ్ లో ఒక్కొక్కరికీ రూ. 13,740 ఛార్జ్ చేస్తారు. అంతేకాదు ఐదేళ్ల నుంచి 11ఏళ్ల లోపు పిల్లలకు స్పెషల్ బెడ్ ను ఏర్పాటు చేస్తారు. ఇందుకు గాను రూ. 13,740 చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్పెషల్ బెడ్ అవసరం లేదనుకుంటే రూ. 13,490 చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి 4 ఏళ్ల వయసు పిల్లలకు స్పెషల్ ఇవ్వరు.. కానీ రూ. 13,490.. అదే రెండేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు రూ. 15,00 లను ఎయిర్ పోర్ట్ లో చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర సదుపాయాలు

ఈ ప్యాకేజీలోనే ప్లేన్ టికెట్స్ కాస్ట్ కలిసి ఉన్నాయి. అంతేకాదు హోటల్ లోనే ఏసీ రూమ్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఒక రోజు బ్రేక్ ఫస్ట్.. రాత్రి  డిన్నర్, మధ్యాహ్నం లంచ్ ని ఇస్తారు. అంతేకాదు లోకల్ సైట్ సీయింగ్ కోసం ప్రత్యేక వాహనాన్ని కల్పిస్తారు. ట్రావెల్ భీమా సదుపాయం ఉంది.

భక్తులకు గమనిక:

ఈ ప్యాకేజీని ఎంచుకున్న భక్తులు.. ప్రయాణ సమయంలో తప్ప క్షేత్రాల దర్శన సమయంలో తప్పనిసరిగా భారతీయ సంప్రదాయంలో దుస్తులను ధరించాల్సి ఉంటుంది. మహిళలు చీరలు, లేదా పంజాబ్ డ్రెస్ లను ధరించవచ్చు. ఇక పురుషులు కుతం పైజామా లేదా వైట్ ధోతీ షర్ట్ ను ధరించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..