Success Story: శ్రమ ఎక్కువే.. లాభాలు కూడా ఎక్కువే.. స్టాబెర్రీస్ సాగుతో కోటీశ్వరుడైన రైతు..

బెర్రీ సాగు చేయడం చాలా శ్రమ కూడి ఉంటుందని సఫీక్ భాయ్ చెప్పాడు. అయితే కష్టానికి తగిన లాభాలు వస్తాయని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు స్ట్రాబెర్రీలను విక్రయించడం ద్వారా కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. ఆధునిక పద్ధతిలో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నానని సఫీక్ చెబుతున్నాడు. మల్చింగ్ ద్వారా స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్‌లో స్ట్రాబెర్రీ చెట్ల మార్పిడి చేస్తానని సఫీక్ చెప్పాడు.

Success Story: శ్రమ ఎక్కువే.. లాభాలు కూడా ఎక్కువే.. స్టాబెర్రీస్ సాగుతో కోటీశ్వరుడైన రైతు..
Strawberry Farming
Follow us

|

Updated on: Aug 12, 2023 | 11:57 AM

వ్యవసాయం విషయంలో యువతలో కూడా మార్పులు వచ్చాయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు భారీ జీతాన్ని కూడా వదులుకుని వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్న యువతీయువకులు రోజు రోజుకీ పెరుగుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయాన్ని, పెద్దలకు చెక్ పెట్టి.. సరికొత్తగా పంటలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. అలా వ్యవసాయంలో విప్లవాన్ని తీసుకొస్తున్న రైతులు ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ  రైతులు సాంప్రదాయ వ్యవసాయం కాకుండా పెద్ద ఎత్తున హార్టికల్చర్ చేస్తున్నారు. పువ్వులు, ఆకుకూరలు, పుట్టగొడుగులు ఇలా అనేక రకాలను పండిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు లక్షాధికారులుగా మారారు. విశేషమేమిటంటే యూపీలో ఇప్పుడు చాలా మంది రైతులు డిఫరెంట్ గా ఆలోచిస్తూ.. విదేశీ పంటలను సైతం సాగు చేసి సక్సెస్ అవుతున్నారు. దీనివల్ల వారు సంవత్సరానికి లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇలా సక్సెస్ అయిన రైతు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సఫీక్ భాయ్. ముజఫర్‌నగర్ జిల్లాలోని భోపా నివాసి. అనుకోకుండా స్టాబెర్రీస్ పంటలను చూసి.. ఆసక్తిని పెంచుకుని స్ట్రాబెర్రీలను పండిస్తూ 10 సంవత్సరాలుగా భారీగా లాభాలను పండిస్తున్నాడు.

మురాద్‌నగర్‌లోని గంగానహర్ సమీపంలో సఫీక్ భాయ్ స్ట్రాబెర్రీ వ్యవసాయం చేస్తున్నాడు. మొదట్లో తాను  11 బిఘాల భూమిలో స్ట్రాబెర్రీ సాగు చేసేవాడని చెప్పారు. అప్పుడు తనకు లాభం వచ్చింది. దీని తరువాత.. తన స్ట్రాబెర్రీ పంటను పండించడానికి భూమి విస్తీర్ణాన్ని పెంచాలని ప్లాన్ చేసాడు. దీంతో 40 బిఘాల భూమిని అద్దెకు తీసుకుని పంట పొలం విస్త్రీర్ణం పెంచాడు. అంతేకాదు తాను పండించిన స్ట్రాబెర్రీలను కూడా తానే  విక్రయిస్తున్నాడు. గత 10 ఏళ్లుగా తన పొలం ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన వాహనదారులను ఆకట్టుకునే విధంగా స్ట్రాబెర్రీ స్టాల్‌ను ఏర్పాటు చేసి.. తక్కువ ధరలో ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ను అందుకున్నాడు. అంతేకాదు  స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఆయన స్టాల్‌కి స్ట్రాబెర్రీలు కొనేందుకు వస్తుంటారు.

6 నెలల్లో స్ట్రాబెర్రీ పంట సిద్ధం

బెర్రీ సాగు చేయడం చాలా శ్రమ కూడి ఉంటుందని సఫీక్ భాయ్ చెప్పాడు. అయితే కష్టానికి తగిన లాభాలు వస్తాయని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు స్ట్రాబెర్రీలను విక్రయించడం ద్వారా కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. ఆధునిక పద్ధతిలో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నానని సఫీక్ చెబుతున్నాడు. మల్చింగ్ ద్వారా స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్‌లో స్ట్రాబెర్రీ చెట్ల మార్పిడి చేస్తానని సఫీక్ చెప్పాడు. స్ట్రాబెర్రీ పంటకు సిద్ధం కావడానికి 6 నెలలు పడుతుంది. అయితే అతివృష్టి కారణంగా దీని పంట దెబ్బతింటుంది. అందుకే స్ట్రాబెర్రీ పొలంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ తప్పని సరిగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

కోట్లు సంపాదిస్తున్న సఫీక్ భాయ్

సఫీక్ భాయ్ ఇంతకుముందు కూరగాయలు పండించేవాడు.. అయితే అతనికి అంతగా లాభాలు రాలేదు. ఒకసారి అతని అన్నయ్య పని మీద హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాడు. అక్కడ స్ట్రాబెర్రీల పంట పొలాలను చూశాడు. దీంతో ఆసక్తిని కలిగి ఇంటికి వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీ వ్యవసాయాన్ని మొదలు పెట్టాడు. సఫీక్ భాయ్ మొదట 2 బిఘాలలో స్ట్రాబెర్రీ సాగును ప్రారంభించాడు. అప్పుడు వచ్చిన లాభాలతో మనోబలం పెరిగింది. దీని తర్వాత స్టాబెర్రీ సాగు చేయడానికి 5 బిఘాలకు పెంచాడు. అదేవిధంగా, క్రమంగా ప్రాంతం 11 బిఘాలకు చేరుకుంది. స్ట్రాబెర్రీలను అమ్మి సఫీక్ భాయ్ ఇప్పటివరకు రూ.1.50 కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు.

లక్ష రూపాయల లాభం ఉంది

కామ్రోస్ రకం స్ట్రాబెర్రీని పండిస్తున్నాడు. దీంతో పాటు స్ట్రాబెర్రీలను కిలో 200 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఢిల్లీ , మీరట్‌లోని మండీల్లో స్ట్రాబెర్రీలను కిలో రూ. 100-125 లకు అమ్ముతాడు. అయితే  ఒక్క బిగాలో 6000 స్ట్రాబెర్రీలు దిగుబడి లభిస్తుంది. కమ్రోస్ మొక్క 6 నుండి 8 రూపాయలకు దొరుకుతుంది. ఒక్కో బీగాలో స్ట్రాబెర్రీ సాగుకు రూ.70 నుంచి 75 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 6 నెలల తర్వాత లక్ష రూపాయల లాభం వస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..