Brinjal Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ అస్సలు తినొద్దు.. ప్రాణాలే పోయే ఛాన్స్..
కొంతమంది వంకాయలను తినడానికి ఇష్టపడతారు. మరికొందరు వాటిని చూస్తేనే బెంబేలెత్తిపోతారు. ఎక్కువ మంది అయితే, వంకాయతో చేసే వంటకాలను ఇష్టంగా తినేస్తారు. వంకాయలో రకాలు కూడా ఉంటాయి. నాటు వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి. వీటిల్లోనూ ఊదా రంగుతో పాటు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోనూ వంకాయలు ఉంటాయి.
కొంతమంది వంకాయలను తినడానికి ఇష్టపడతారు. మరికొందరు వాటిని చూస్తేనే బెంబేలెత్తిపోతారు. ఎక్కువ మంది అయితే, వంకాయతో చేసే వంటకాలను ఇష్టంగా తినేస్తారు. వంకాయలో రకాలు కూడా ఉంటాయి. నాటు వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి. వీటిల్లోనూ ఊదా రంగుతో పాటు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోనూ వంకాయలు ఉంటాయి. ఎంతో రుచికరమైన ఈ వంకాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే, అదే సమయంలో కొందరికి వంకాయ ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు వంకాయను తినడం వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. మరి ఎవరు వంకాయను తినకూడదు? తింటే ఏం జరుగుతుంది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యక్తులు బెండకాయ తినొద్దు..
1. కిడ్నీ స్టోన్‌తో బాధపడేవారు.
కిడ్నీ స్టోన్ ఉన్నవారు బెండకాయ తినకూడదు. కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినడం వల్ల.. అందులోని గింజలు కిడ్నీలో మరిన్ని రాళ్లు తయారయ్యేందుకు కారణం అవుతాయి. తద్వారా కిడ్నీ దెబ్బ తింటుంది.
2. ఎముకలకు మంచిది కాదు..
వంకాయలో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా కాల్షియం శోషణ తగ్గుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వ్యక్తులు బెండకాయ తినకుడదు.
3. పైల్స్ బాధితులు..
పైల్స్ బాధితులు కూడా వంకాయకు దూరంగా ఉండటం ఉత్తమం. రక్తహీనత, పైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తినొద్దు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
4. ఆర్థరైటిస్ పేషెంట్లు వంకాయ తినకూడదు..
కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు వంకాయ తినకూడదు. దీని వల్ల కీళ్లనొప్పుల సమస్య మరింత తీవ్రమవుతుంది.
5. ఈ సమస్యలు కూడా రావచ్చు..
వంకాయలు ఎక్కువగా తినడం కూడా హానికరం. దీని కారణంగా.. కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, దురద వంటి సమస్యలు వస్తాయి.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం వైద్యులు, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. వీటిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..