ఆడవాళ్లకు అలర్ట్.. తలస్నానం చేసిన వెంటనే జుట్టుకు టవల్ చుట్టుకుంటున్నారా? ఎంత డేంజర్ అంటే..

చాలా మంది మహిళలు తలస్నానం చేసిన తర్వాత లేదా జుట్టును కడిగిన తర్వాత జుట్టుకు టవల్‌ను చుట్టుకుంటారు. తద్వారా జుట్టు త్వరగా పొడిబారుతుందని విశ్వాసం. అయితే అలా చేయడం వల్ల జుట్టుకు చాలా నష్టం వాటిల్లుతుంది. చాలా మంది మహిళలు చుండ్రు, జుట్టు రాలడం, పొడిబారడం మొదలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు..

ఆడవాళ్లకు అలర్ట్.. తలస్నానం చేసిన వెంటనే జుట్టుకు టవల్ చుట్టుకుంటున్నారా? ఎంత డేంజర్ అంటే..
Hair Care
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 27, 2023 | 9:10 AM

చాలా మంది మహిళలు తలస్నానం చేసిన తర్వాత లేదా జుట్టును కడిగిన తర్వాత జుట్టుకు టవల్‌ను చుట్టుకుంటారు. తద్వారా జుట్టు త్వరగా పొడిబారుతుందని విశ్వాసం. అయితే అలా చేయడం వల్ల జుట్టుకు చాలా నష్టం వాటిల్లుతుంది. చాలా మంది మహిళలు చుండ్రు, జుట్టు రాలడం, పొడిబారడం మొదలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఈ చర్య కూడా జుట్టుకు హానీ తలపెడుతుంది. జుట్టుకు టవల్ ఎందుకు కట్టుకోకూడదు? కట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టుకు టవల్ చుట్టడం వల్ల కలిగే నష్టాలివే..

1. జుట్టును కడిగిన తర్వాత తలకు టవల్ చుట్టుకుంటే.. తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

2. తలస్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకోవడం వల్ల స్కాల్ప్ చాలా సేపు తడిగా ఉంటుంది. దాని వల్ల చుండ్రు వచ్చే అవకాశం పెరుగుతుంది.

3. జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడే వ్యక్తులు ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయకూడదు. జుట్టుకు టవల్ కట్టడం వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

4. తడి జుట్టుకు టవల్ కట్టడం వల్ల, అది జుట్టు సహజ షైన్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

5. శరీరం మొత్తం తుడుచుకున్న తర్వాత అదే టవల్‌తో జుట్టును చుట్టుకుంటే, శరీరంలోని మురికి జుట్టులోకి వెళ్లుతుంది.

వెంట్రుకలు పొడిబారాలంటే ఏం చేయాలి..

జుట్టుకు టవల్ కట్టుకోవడం ప్రమాదకరం అయితే.. ఏం చేయాలి? అనే ప్రశ్న వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సూర్యకాంతిలో జుట్టును ఆరబెట్టడం ఉత్తమం. ఇంట్లో సూర్యరశ్మి లేకపోతే.. హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించొచ్చు. అయితే, హెయిర్ డ్రైయర్‌ ఎక్కువగా హీట్ చేయొద్దు. లేదంటే.. జుట్టు పాడయ్యే అవకాశం ఉంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. ఏవైనా సమస్యలుంటే వైద్య సలహా తీసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..