Health Tips: చేప‌లతో నమ్మలేని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. తెలిశాక చికెన్ వద్దు-చేప ముద్దు అనాల్సిందే..!

Fish for Health: క్రమంలో పండ్లు, కూరగాయలను అనునిత్యం తీసుకోవడం మంచిది. అలాగే మీరు చేపలను కూడా ఆహారంలో భాగంగా చేసకోవచ్చు. చేపల్లో శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలు ఉండడంతో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకున్నవారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. మొత్తంగా  వారంలో ఒక్క సారి అయినా చేపలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో..

Health Tips: చేప‌లతో నమ్మలేని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. తెలిశాక చికెన్ వద్దు-చేప ముద్దు అనాల్సిందే..!
Fish Food
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 23, 2023 | 6:21 AM

Fish for Health: నిత్యం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలను అనునిత్యం తీసుకోవడం మంచిది. అలాగే మీరు చేపలను కూడా ఆహారంలో భాగంగా చేసకోవచ్చు. చేపల్లో శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలు ఉండడంతో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకున్నవారు కూడా మంచి ఫలితాలను పొందుతారు. మొత్తంగా  వారంలో ఒక్క సారి అయినా చేపలను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. చేపలను తినడం వల్ల శరీరానికి సత్వర శక్తి వస్తుంది. చేపల్లోని అమినో యాసిడ్స్ శారీరక అభివృద్ధి, బలానికి ఉపయోగపడతాయి.
  2. చేపలలో ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకా రక్తపోటును నియంత్రించడంలో శరీరానికి సహాయపడతాయి.
  3. చేపల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మన మెదడులోని న్యూరాన్ల అభివృద్ధిని స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఫలితంగా మన మెదడు పనితీరు, సామర్థ్యం పెరుగుతాయి.
  4. చేపలు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను కలిగి ఉంటాయి, ఫలితంగా శరీరంలో పోషకాహార లోపం సమస్య ఎదురు కాదు.
  5. ఇవి కూడా చదవండి
  6. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మినరల్స్‌ని కలిగిన చేపలు మన శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడంతో కీలక పాత్ర పోషిస్తాయి. బోలు ఎముకల సమస్యలను నివారిస్తాయి.
  7. చేపలలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  8. చేపలో ఉండే ప్రోటీన్, విటమిన్ డి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు, వారి శిశువుల ఆరోగ్యానికి కూడా చేపలు మేలు చేస్తాయి.
  9. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొవ్వు చేపలను తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచగలవు. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
  10. చేపలలో లభించే విటమిన్ ఇ, సెలీనియం మనకు నేచురల్ యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఈ కారణంగా కేశ, చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..