Car Tips: మీ కారు నుంచి వచ్చే ఈ రంగు పొగ ఇంజన్‌లోని ఏ సమస్యను సూచిస్తుందో తెలుసుకోండి..

Car Maintenance Tips: మీ వాహనం నుంచి వచ్చే పొగ దాని ఆరోగ్యం గురించి చెబుతుంది. రంగు పొగ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Car Tips: మీ కారు నుంచి వచ్చే ఈ రంగు పొగ ఇంజన్‌లోని ఏ సమస్యను సూచిస్తుందో తెలుసుకోండి..
Car Smoke
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 20, 2022 | 6:06 PM

మనకు వచ్చే అనారోగ్యాలు.. మన ఆరోగ్యం గురించి వెల్లడిస్తాయి. అదే మన ఇంట్లోని కారు, బైక్ ఇంజన్ హెల్త్ గురించి ఎలా తెలియాలి..? మెకానిక్ మాత్రమే గుర్తిస్తాడా..? లేక మనం కూడా ముందే గుర్తించవచ్చా..? అంటే మనం కూడా ముందస్తుగానే మన వాహనం హెల్త్ గుర్తించవచ్చు. అది ఎలా అంటే..  మన కారు నుంచి వచ్చే పొగ దాని ఇంజన్ కండీషన్ ఏంటో ఇట్టే చెప్పేస్తుంది. దానికి ఇంజన్‌లో సమస్య ఉందా..? ఆయిల్ తగ్గిపోయిందా..? పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బ తిందా..? ఇలాంటి చాలా సమస్యలను దాని నుంచి వచ్చే పొగ చెప్పేస్తుంది.

తరచుగా మన కారు, బైక్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అలాంటి సిగ్నల్ ఒకటి కారు పొగ. వాహనం నుంచి వచ్చే పొగ దాని ఆరోగ్యం గురించి చెబుతుంది. రంగు పొగ అంటే ఏంటో ఇక్కడ జాబితా ద్వారా తెలుసుకుందాం. దీనిపై అవగాహన కలిగి ఉంటే సరైన సమయంలో కారులో వస్తున్న సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించుకోగలుగుతారు.

1. బ్లాక్ స్మోక్ 

మీ కారు నుంచి బ్లాక్ కలర్ పొగ రావడం మొదలైతే, ఇంధనం లీక్ అవుతుందని అర్థం చేసుకోండి. ఇంధనం లీకేజీ అయినప్పుడు మాత్రమే వాహనం నుంచి వచ్చే పొగ నల్లగా ఉంటుంది. గాలి-ఇంధన నిష్పత్తిలో తేడా ఉన్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. ఇది కాకుండా, అరిగిపోయిన నాజిల్ కారణంగా ఇంధన ఇంజెక్టర్ లీకేజీ ఉంటుంది. దీని కారణంగా కూడా ఇటువంటి సమస్య రావొచ్చు.

2. నీలిరంగు పొగ

చాలా సార్లు పాత వాహనాలు కూడా నీలి పొగ బయటకు వస్తుంటుంది. ఈ రకమైన పొగ ఇంజిన్‌లో లోపం ఉందని అర్థం. పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బతిందని అర్థం. ఇలాంటి సమస్య రావడం వల్లనే ఇటువంటి పొగ బయటకు వస్తుంది. నీలి రంగు పొగ వస్తుందంటే వీలైనంత త్వరగా మెకానిక్‌కి చూపించి కారును సరిచేయించుకోవడం మంచిది.

3. తెల్లటి పొగ

మీ కారు నుంచి తెల్లటి పొగ వచ్చినా మీరు అప్రమత్తంగా ఉండాలి. దీని రేడియేటర్ లీక్ అవ్వడం ప్రారంభించినప్పుడు ఈ రకమైన పొగ వస్తుంది. రేడియేటర్ పని వాహనం ఇంజిన్ చల్లగా ఉంచడం. ఇందులో ఆయిల్ కూలెట్ లీక్ అయితే కారు త్వరగా వేడెక్కుతుంది. ఈ వేడికి ఇంజిన్ సీజ్ కావచ్చు. కాబట్టి మీకు దగ్గరలోని మెకానిక్ వద్దకు వెళ్లండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం