Kidney Stones: కిడ్నీ స్టోన్స్ కారణంగా విపరీతమైన నొప్పి వస్తోందా? ఇవి తింటే అంతా సెట్ అవుతుంది..

సరికాని ఆహారం తినడం, ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తుంది. కిడ్నీలో స్టోన్స్ కారణంగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ బాధ వర్ణించలేని పరిస్థితి ఉంటుంది.

Kidney Stones: కిడ్నీ స్టోన్స్ కారణంగా విపరీతమైన నొప్పి వస్తోందా? ఇవి తింటే అంతా సెట్ అవుతుంది..
Kidney Stone Pain
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 01, 2023 | 6:15 PM

సరికాని ఆహారం తినడం, ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తుంది. కిడ్నీలో స్టోన్స్ కారణంగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ బాధ వర్ణించలేని పరిస్థితి ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్లు, అధిక బరువు, అధికంగా సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మన రక్తంలో సోడియం, కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉంటే అవి కిడ్నీలో పేరుకుపోయి రాళ్లు ఏర్పడేందుకు కారణం అవుతుంది. దీని కారణంగా.. మూత్రాశయంలోకి మూత్రం చేరే మార్గంలో అవరోధం ఏర్పడుతుంది. ఫలితంగా విపరీతమై నొప్పి వస్తుంది. ఈ నొప్పి సమస్య తగ్గడానికి, కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కిడ్నీ స్టోన్‌ని ఎలా గుర్తించాలి?..

సాధారణం కంటే తక్కువ ఆకలితో ఉన్నట్లయితే.. కిడ్నీ స్టోన్స్‌కు సంకేతంగా పేర్కొంటున్నారు నిపుణులు. జ్వరంతో పాటు చలి, ఆకస్మిక కడుపు నొప్పి కూడా మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధించిన ప్రధాన లక్షణాలు. చాలా మందికి యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ సమస్య వచ్చి వాంతులు అవుతుంటాయి.

ఎలాంటి ఆహారం తినాలి..

కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలి. కొబ్బరి నీళ్లు కాకుండా నిమ్మరసం, నారింజ రసం తాగాలి. సరిపడా నీళ్లు తాగడం వల్ల మూత్ర విసర్జన సమస్య ఉండదు. అలాగే, యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే హెర్బల్ టీ తాగడం వల్ల కిడ్నీలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఇది కిడ్నీలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. హెర్బల్ టీని రోజుకు రెండుసార్లు త్రాగాలి.

ఇవి కూడా చదవండి

ఆహారంలో ఫైబర్ చేర్చుకోవాలి..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలి. పండ్లలో ఆపిల్, నారింజ, అరటి, పచ్చి కొబ్బరి ఉత్తమం. తినదగిన కూరగాయలలో బఠానీలు, బీన్స్, క్యారెట్, పుట్టగొడుగులు, పొట్లకాయ, దోసకాయ, బ్రకోలీ తీసుకోవచ్చు.

వీటి జోలికి వెళ్లొద్దు..

మార్కెట్‌లో విక్రయించే మిఠాయిలు ఎక్కువగా తినొద్దు. అలాగే ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా తీసుకోవద్దు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. అందుకే ఉప్పు తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. వీటితో పాటు.. పచ్చి ఉల్లి, బెండకాయ, డ్రై ఫ్రూట్స్, పాలకూర, చాక్లెట్ వంటివి కూడా కిడ్నీ స్టోన్స్ పరిమాణాన్ని పెంచుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..