Bizarre: ఇలాంటి భార్య లైఫ్‌లోకి రావాలంటే వంద జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి.. కారణం తెలిస్తే కుల్లుకుంటారు..!

|

Mar 30, 2023 | 7:04 AM

మన తాతల కాలం నాటి వివాహిత ఆచార, సంప్రదాయాలకు, భర్తకు ఇచ్చే విలువలకు.. నేటి వివాహితలు పాటించే ఆచార సంప్రదాయాలు, భర్తలకు ఇచ్చే విలువలకు చాలా తేడాలు ఉన్నాయి. నాటి స్త్రీలు పెళ్లి తరువాత భర్తే సర్వస్వం అనేలా ఉండేవారు. సంప్రదాయాలను పాటిస్తూ.. అనాదిగా వస్తున్న ఆచారాలన్నింటినీ పాటించేవారు.

Bizarre: ఇలాంటి భార్య లైఫ్‌లోకి రావాలంటే వంద జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి.. కారణం తెలిస్తే కుల్లుకుంటారు..!
Wife And Husband
Follow us on

మన తాతల కాలం నాటి వివాహిత ఆచార, సంప్రదాయాలకు, భర్తకు ఇచ్చే విలువలకు.. నేటి వివాహితలు పాటించే ఆచార సంప్రదాయాలు, భర్తలకు ఇచ్చే విలువలకు చాలా తేడాలు ఉన్నాయి. నాటి స్త్రీలు పెళ్లి తరువాత భర్తే సర్వస్వం అనేలా ఉండేవారు. సంప్రదాయాలను పాటిస్తూ.. అనాదిగా వస్తున్న ఆచారాలన్నింటినీ పాటించేవారు. భర్త సంతోషం కోసం ఏమైనా చేసేవారు. భర్త మాటను వేదవాక్కులా భావించేవారు. ఇలాంటి స్త్రీలు నేడు కూడా ఉన్నారంటే నమ్ముతారా? అది కూడా భర్త సంతోషం కోసం పర స్త్రీతో బెడ్‌రూమ్‌లో గడిపే అవకాశం ఇచ్చే స్త్రీలు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత తన భర్త సంతోషమే తనకు ముఖ్యమని భావించి.. మరో స్త్రీతో అతను శృంగారం చేయడానికి అనుమతిచ్చింది. అంతేకాదు.. ఆయనగారికి అవసరమైన ఆహారాన్ని వండి మరీ అందించింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

అమెరికాకు చెందిన మోనికా హాల్డెట్.. తన భర్త జాన్‌ను సంతోష పెట్టడమే తన ప్రాథమిక లక్ష్యంగా పేర్కొంది. అంతేకాదు.. ఆయనగారు పరాయి స్త్రీలతో శృంగారం చేయడానికి, ఏకంగా ఇంటికి తీసుకువచ్చి రాత్రి బస చేయడానికి కూడా ఆమె అంగీకారం చెబుతోంది. అయితే, ఆమె ఇలా చేయడం వల్ల వారి బంధం బలంగా ఉంటుందట. ఆయన గారి సంతోషమే తన సంతోషంగా చెబుతున్న హాల్డ్‌ట్ మాటలు విని మిగతా మహిళలు షాక్ అవుతున్నారు. అంతేకాదు.. ‘భర్త ఏం చెబితే అది చేస్తానని, ఆయన ఇచ్చిన బట్టలు కట్టుకుంటా, ఆయన చెప్పిన మాట వింటా, ఆయన తెచ్చిన ఫుడ్డును తింటా.. ఇది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వాస్తవానికి నా భర్తకు సమయం ఉండదు. అందుకే వేరే మహిళలతో బయటకు వెళ్లేందుకు అనుమతిస్తాను.’ అని చెప్పుకొచ్చింది ఈ ఇల్లాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..