Gas Burner: గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా? ఇలా చేస్తే చిటికెలో జిగేల్‌మని మెరుస్తుంది..

|

Mar 30, 2023 | 6:46 AM

చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కిచెన్ టైల్స్, ట్యాప్ వంటి వాటిని శుభ్రంగా ఉంచుతారు. కానీ వంట చేసే వస్తువులపై శ్రద్ధ చూపరు. అందులో గ్యాస్ బర్నర్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలా మంది వంటగదిలో గ్యాస్ బర్నర్‌ను పెద్దగా పట్టించుకోరు. ఆ కారణంగానే అది మొత్తం నల్లగా మారిపోయి ఉంటుంది.

Gas Burner: గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా? ఇలా చేస్తే చిటికెలో జిగేల్‌మని మెరుస్తుంది..
Gas Burner
Follow us on

చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కిచెన్ టైల్స్, ట్యాప్ వంటి వాటిని శుభ్రంగా ఉంచుతారు. కానీ వంట చేసే వస్తువులపై శ్రద్ధ చూపరు. అందులో గ్యాస్ బర్నర్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలా మంది వంటగదిలో గ్యాస్ బర్నర్‌ను పెద్దగా పట్టించుకోరు. ఆ కారణంగానే అది మొత్తం నల్లగా మారిపోయి ఉంటుంది. ఈ కారణంగానే దానిని క్లీన్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మీకోసం కొన్ని ఈజీ టిప్స్ తీసుకొచ్చాం. వీటి సాయంతో నల్లగా మారిన గ్యాస్ బర్నర్‌ను క్షణాల్లో జిగేల్ అనేలా చేయొచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూద్దాం.

వెనిగర్..

గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడానికి వెనిగర్‌ను ఉపయోగించొచ్చు. ఒక గిన్నెలో అరకప్పు వెనిగర్ పోయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్ ముంచి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఒక బ్రష్ సాయంతో గ్యాస్‌ బర్నర్‌ను శుభ్రం చేయాలి. ఆ నలుపు రంగు అంతా పోతుంది.

నిమ్మరసం, ఈనో..

ఈనో ని ఉపయోగించి కూడా గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకోవాలి. అందులో నిమ్మరసం, ఈనో ని కలపాలి. ఆ మిశ్రమంలో గ్యాస్ బర్నర్ వేసి ఉంచాలి. కాసేపు అలాగే ఉంచిన తరువాత దానిని శుభ్రం చేస్తే ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..