Kidney Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తినాలి?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి. అవి సక్రమంగా పనిచేయాలంటే మనం ప్రతిరోజూ సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీల్లో తేడా ఉంటే.. చేతులు, కాళ్లలో నీరు చేరినట్లు కనిపిస్తాయి. అలాగే కళ్లు కూడా ఉబ్బిపోతాయి. మూత్రవిసర్జన చేయడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి లక్షణాలు మీక్కూడా..

Kidney Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తినాలి?
Kidney
Follow us

|

Updated on: Aug 21, 2023 | 10:04 PM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి. అవి సక్రమంగా పనిచేయాలంటే మనం ప్రతిరోజూ సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీల్లో తేడా ఉంటే.. చేతులు, కాళ్లలో నీరు చేరినట్లు కనిపిస్తాయి. అలాగే కళ్లు కూడా ఉబ్బిపోతాయి. మూత్రవిసర్జన చేయడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి లక్షణాలు మీక్కూడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి.. పరీక్షలు చేయించుకోవడం మంచిది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని ఆహారాలను తీసుకోవాలి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి:

సముద్రపు చేపలు: సముద్రపు చేపల్ని తరచూ తింటూ ఉండాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. చేపల్లో ఉండే ప్రొటీన్లు కూడా కిడ్నీలను కాపాడుతాయి.

ఇవి కూడా చదవండి

ఫ్రెష్ ఫ్రూట్స్: తాజా పండ్లరసాలు, కూరగాయల రసాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యం ఉంటుంది. తద్వార కిడ్నీలు ఎప్పటికప్పుడు శుభ్రమై.. ఆరోగ్యంగా ఉంటాయి.

కూరగాయల జ్యూస్: డయాలసిస్ చేయించుకునేవారు కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు తరచూ కూరగాయల జ్యూస్ లు తాగాలి.

బెర్రీలు: బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

యాపిల్: యాపిల్ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు అధికంగా లభించే యాపిల్స్ ను రోజూ తింటే కిడ్నీలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

రెడ్ క్యాప్సికమ్: రెడ్ క్యాప్సికమ్ కిడ్నీలకు చాలా మేలు చేస్తుంది. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.

విటమిన్స్: విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ లు రెడ్ క్యాప్సికమ్ లో లభిస్తాయి. వీటిలో ఉండే లైకోపిన్ క్యాన్సర్ ను రాకుండా నియంత్రిస్తుంది.

ప్రొటీన్స్: కిడ్నీల సమస్యతో బాధపడేవారు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనను తీసేసి తినడం ఆరోగ్యానికి మంచిది.

క్యాలీఫ్లవర్: క్యాలీఫ్లవర్ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపుతుంది. శరీరంలో మలినాలను బయటకుపంపే ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్, థియోసైనేట్స్ ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి