Health Benefits in Albakara Fruit: ఆల్ బుకర పండ్లను తింటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!!

సీజన్ల వారిగా మాత్రమే దొరికే పండ్లలో ఆల్ బుకరా(Plum Apple) ఒకటి. వాడుక భాషలో మనం ఆల్ బకరా అని కూడా పిలుస్తాం. ఈ పండ్లు ప్రత్యేకంగా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. సీజన్ల వారీగా దొరికే పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చూడటానికి టమాటాల వలె ఎర్రగా.. చిన్నగా ఉంటాయి. రుచికి పుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది షుగర్ ఉన్న వారికి బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. మానవ శరీరానికి..

Health Benefits in Albakara Fruit: ఆల్ బుకర పండ్లను తింటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!!
Albakara Fruit
Follow us

|

Updated on: Aug 21, 2023 | 8:40 PM

సీజన్ల వారిగా మాత్రమే దొరికే పండ్లలో ఆల్ బుకరా(Plum Apple) ఒకటి. వాడుక భాషలో మనం ఆల్ బకరా అని కూడా పిలుస్తాం. ఈ పండ్లు ప్రత్యేకంగా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. సీజన్ల వారీగా దొరికే పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చూడటానికి టమాటాల వలె ఎర్రగా.. చిన్నగా ఉంటాయి. రుచికి పుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది షుగర్ ఉన్న వారికి బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు, ఖనిజాలు ఇందులో లభిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దామా.

ఆల్ బుకరా(Plum Apple) పండ్లలో అనేక ఔషధ గుణాలున్నాయి.

– పుల్లగా ఉండే ఆహారాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని తెలుసుకదా. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

– శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.

– ఆల్ బుకరా పండ్లు తింటే.. శ్వాస, రొమ్ము సంబంధిత క్యాన్సర్లు రావు. వీటిలో ఉండే విటమిన్ ఎ నోటికి సంబంధిన క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి.

– శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఏర్పడుతాయి. ఇవి రక్తహీనత సమస్యను పరిష్కరిస్తాయి.

– ఈ పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలో అలసటను తగ్గిస్తాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.

– ఆల్ బుకరా పండ్లను తినడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. డైట్ లో తినే ఫ్రూట్స్ లో వీటిని కూడా తీసుకోవచ్చు. శరీరంలోని మలినాలను, చెడుకొవ్వును బయటకు పంపుతాయి.

– అలాగే ఆల్ బుకరా పండ్లలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని గట్టిగా తయారు చేయడంలో సహాయపడుతాయి. గర్భిణీ స్త్రీలు కూడా ఆల్ బుకరా పండ్లను తినవచ్చు.

-ఈ పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది

-ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రక్త హీనత సమస్య రాకుండా పరిష్కరిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి