kitchen hacks: ఆరోగ్యానికి సంజీవని నల్ల జీలకర్ర.. ఎలా వాడాలో తెలుసా?

మనం రోజూ తినే ఆహారపదార్థాల్లో ఏదోరకంగా జీలకర్రను వాడుతాం. తాలింపుల్లో, మసాలా పొడుల్లో జీలకర్రను వేస్తుంటాం. కానీ.. నల్ల జీలకర్రను ఆహారంగా తీసుకోం. జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే.. నల్ల జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు మరింత రెట్టింపుగా ఉంటాయి. నల్ల జీలకర్ర శాస్త్రీయ నామం నిజెల్లా సటీవ. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా పిలుస్తారు. హోటల్స్, రెస్టారెంట్లలో తందూరీ రోటీ, పాస్తా వంటి వంటకాల్లో గార్నిష్ కోసం వాడుతుంటారు. నల్ల జీలకర్రను వాడటం వల్ల కలిగే ఉపయోగాలేంటో..

kitchen hacks: ఆరోగ్యానికి సంజీవని నల్ల జీలకర్ర.. ఎలా వాడాలో తెలుసా?
Black Cumin
Follow us

|

Updated on: Aug 17, 2023 | 8:21 PM

మనం రోజూ తినే ఆహారపదార్థాల్లో ఏదోరకంగా జీలకర్రను వాడుతాం. తాలింపుల్లో, మసాలా పొడుల్లో జీలకర్రను వేస్తుంటాం. కానీ.. నల్ల జీలకర్రను ఆహారంగా తీసుకోం. జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే.. నల్ల జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు మరింత రెట్టింపుగా ఉంటాయి. నల్ల జీలకర్ర శాస్త్రీయ నామం నిజెల్లా సటీవ. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా పిలుస్తారు. హోటల్స్, రెస్టారెంట్లలో తందూరీ రోటీ, పాస్తా వంటి వంటకాల్లో గార్నిష్ కోసం వాడుతుంటారు. నల్ల జీలకర్రను వాడటం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఈ రోజు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ అరగదు: నల్లజీలకర్ర తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తూ.. ఊబకాయం, ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.

తలనొప్పి మాయం: నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెను నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గి.. ప్రశాంతమైన నిద్ర అందుతుంది.

ఇవి కూడా చదవండి

పళ్ల సమస్యలు ఉండవు: నల్లజీలకర్ర నూనె పంటి సమస్యలను కూడా తగ్గుతుంది. పంటినొప్పి, చిగుళ్ల సమస్యలను ఈ నూనెలో ఉండే థైమోక్విన్ అనే కెమికల్ నివారించి, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మతిమరుపు మాయం: వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపుకి నల్ల జీలకర్ర సరైన ఔషధం. పరగడుపునే ఒక అర టీ స్పూన్ నల్ల జీలకర్రను తింటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

జుట్టు పెరుగుతుంది: నల్లజీలకర్రను తలకు, చర్మానికి రాస్తే.. అందులో ఉన్న ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. కొబ్బరి నూనెలో, నల్ల జీలకర్ర నూనెను కలిపి రాస్తే.. జుట్టు పెరిగి దృఢంగా తయారవుతుంది. చుండ్రుకూడా తగ్గుతుంది.

మెటబాలిజంను మెరుగు: నల్ల జీలకర్ర లివర్ మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణనిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

ఆస్తమా తగ్గుతుంది: నల్లజీలకర్ర నూనె, తేనె.. గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.

క్యాన్సర్ కు దూరం: నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి.. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్లను నివారిస్తాయి.

మొటిమలు పోతాయి: ఒక కప్పు నిమ్మరసంలో అర టీ స్పూన్ నల్ల జీలకర్ర నూనెను కలిపి రోజుకు రెండుసార్లు ముఖానికి రాస్తే.. మొటిమలు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి