Seasonal Diseases: సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను తినండి!!

వర్షాకాలం అంటేనే.. సీజనల్ వ్యాధుల కాలం. వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. జలుబు, జ్వరం, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, బోదకాలు, విరేచనాలు, వాంతులు ఇలా రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటాం. అందుకు కారణం.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే. వాతావరణం మారడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం సహజమే..

Seasonal Diseases: సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను తినండి!!
Food Tips
Follow us
Chinni

|

Updated on: Aug 17, 2023 | 8:10 PM

వర్షాకాలం అంటేనే.. సీజనల్ వ్యాధుల కాలం. వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. జలుబు, జ్వరం, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, బోదకాలు, విరేచనాలు, వాంతులు ఇలా రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటాం. అందుకు కారణం.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే. వాతావరణం మారడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం సహజమే. వాటిబారిన పడకుండా ఉండాలంటే.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. అంటే ఏం తినాలి ? అనే కదా సందేహం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు వీలైనంత వరకూ తినాలి. నారింజ, జామకాయ, చెర్రీ, ఆల్ బుకరా, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, స్ట్రా బెర్రీస్, కివీ వంటి పండ్లను లేదా ఇంట్లోనే వాటిని జ్యూస్ లుగా చేసి తీసుకోవాలి. నిమ్మ కాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కానీ.. దానిని డైరెక్టుగా తినలేం కాబట్టి నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగాలి. లేదా నిమ్మకాయతో పప్పు చేసుకుని కూడా తినొచ్చు. అలాగే పచ్చి మిరపకాయ కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా లభిస్తాయి. పచ్చిమిర్చి యాంటీ మైక్రోబయల్ గుణాలను కలిగి ఉంటుంది.

విటమిన్ సి మాత్రమే కాదు.. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. బీన్స్, చిక్కుళ్లు, గుడ్లు, సోయా, పాలు, పాల ఉత్పత్తులను ఆహారంలో తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని కూడా తింటూ ఉండాలి. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ వంటి లక్షణాలు అధికంగా ఉన్నాయి. తరచూ ఆకుకూరలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ కలర్ లో ఉండే వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. వీలైనంతవరకూ ఉడికించిన పదార్థాలను తినాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి