Beetroot Juice for Health Benefits: లివర్, రక్తనాళాలను క్లీన్ చేసే జ్యూస్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్

బీట్ రూట్ ను ప్రధానంగా ఉపయోగించి చేసే ఈ జ్యూస్ ను తాగడం వల్ల కాలేయంలో పేరుకున్న మలినాలు తొలగిపోయి.. కాలేయం శుభ్రమవుతుంది. రక్తనాళాల్లో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోయి.. రక్తం శుభ్ర పడుతుంది. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. బీపీ కూడా కంట్రోల్ లో..

Beetroot Juice for Health Benefits: లివర్, రక్తనాళాలను క్లీన్ చేసే జ్యూస్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్
Beetroot Juice
Follow us

|

Updated on: Aug 23, 2023 | 6:53 PM

కొన్ని కూరగాయలతో తయారు చేసే జ్యూస్ లను తాగడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు… బరువు కూడా తేలికగా తగ్గొచ్చు. వెజిటబుల్ జ్యూస్ ల వినియోగం గురించి ఇప్పటి వరకూ చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు మరో వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో.. దానిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.

శరీరానికి అనేక ప్రయోజనాలు:

బీట్ రూట్ ను ప్రధానంగా ఉపయోగించి చేసే ఈ జ్యూస్ ను తాగడం వల్ల కాలేయంలో పేరుకున్న మలినాలు తొలగిపోయి.. కాలేయం శుభ్రమవుతుంది. రక్తనాళాల్లో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోయి.. రక్తం శుభ్ర పడుతుంది. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి.. శరీరం శుభ్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఈ జ్యూస్ ను తయారు చేసుకునేందురు బీట్ రూట్, క్యారెట్, గుప్పెడు కొత్తిమీర, 2 ఇంచుల అల్లం, ఒక టమాట తీసుకోవాలి. బీట్ రూట్ పై చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, టమాటా, అల్లంను ముక్కలుగా తరిగి.. మిక్సీ జార్ లో వేసి అర టీ గ్లాస్ నీళ్లుపోసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మరో అర టీ గ్లాస్ నీళ్లుపోసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టి.. ఆ జ్యూస్ ను తాగాలి.

ఇలా కూడా తాగొచ్చు:

జ్యూస్ ను యథావిధిగా తాగలేకపోతే.. కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కాలేయం శుభ్రం అవ్వడంతో పాటు బరువు కూడా తేలికగా తగ్గవచ్చు. చర్మం కూడా కాంతివంతంగా, అందంగా తయారవుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పోయి.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడకుండా ఉంటాం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి