Health Tips: శరీరంలోని ఈ 5 భాగాల్లో ‘వాపు’ కనిపిస్తోందా? వెంటనే వైద్యలను సంప్రదించండి..

సాధారణంగా చాలా మంది కాళ్ల వాపు, కడుపు నొప్పి, కళ్లలో మంట, ఇతర సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ సమస్యలు.. కొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతంగా పేర్కొంటున్నారు వైద్యులు. ఏదైనా వ్యాధి తీవ్రతరం కావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు ముందుగా బయటపడుతాయట.

Health Tips: శరీరంలోని ఈ 5 భాగాల్లో ‘వాపు’ కనిపిస్తోందా? వెంటనే వైద్యలను సంప్రదించండి..
Fatty Liver
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 22, 2023 | 1:35 PM

సాధారణంగా చాలా మంది కాళ్ల వాపు, కడుపు నొప్పి, కళ్లలో మంట, ఇతర సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ సమస్యలు.. కొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతంగా పేర్కొంటున్నారు వైద్యులు. ఏదైనా వ్యాధి తీవ్రతరం కావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు ముందుగా బయటపడుతాయట. ఈ సమస్యలను గుర్తించి, అలర్ట్ అయితే ఎలాంటి సమస్యా ఉండదంటున్నారు నిపుణులు. లేదంటే సమస్య మరింత తీవ్రం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రోజుల్లో చాలా మంది సరికాని జీవన శైలి కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే, దీనిని గుర్తించడం చాలా కష్టం. దీనికి సకాలంలో వైద్యం అందించకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమస్యను నివారించడానికి మార్గం ఉందని, శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి వైద్య చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ మార్పులు ఏంటి? ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కడుపు నొప్పి: పొత్తి కడుపులో వాపు ఫ్యాటీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వలన కడుపులో వాపు వస్తుంది. తద్వారా కడుపు నొప్పి వస్తుంది. ఈ ఇబ్బందులు మీ శరీరంలో కనిపించినట్లయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

చీలమండ వాపు: చీలమండలో వాపు కూడా ఫ్యాటీ లివర్ సమస్యకు సంకేతం. కాలేయంలో కొవ్వు నిల్వ పెరిగినప్పుడు దాని ప్రభావం చీలమండలు, పాదాలపై కూడా పడుతుంది. కొవ్వు చీలమండలు, పాదాలలో పేరుకుపోవడం వలన వాపు వస్తుంది. ఇలాంటి సమస్య మీలో ఎదురైతే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

కళ్లు: ఫ్యాటీ లివర్ వ్యాధి సంకేతాలలో కళ్ల వాపు కూడా ఒకటి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వలన కళ్లలో కూడా వాపు వస్తుంది. కళ్ల చుట్టూ ఉబ్బినట్లుగా ఉంటుంది. ఈ సమస్య మీకు ఉన్నట్లయితే వెంటనే వైద్యులకు చూపించి, చికిత్స తీసుకోవాలి.

కాళ్లలో వాపు: కాళ్లలో వాపు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతం. పాదాలలో నొప్పి, వాపు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

కీళ్ల నొప్పులు: కీళ్ల నొప్పి విపరీతంగా ఉన్నట్లయితే.. ఇది కాలేయ వ్యాధికి సంకేతం. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోయినప్పుడు.. దాని ప్రభావం శరీరంపై ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పి, వాపు సమస్య తలెత్తుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించి, వారి సలహాల మేరకు చికిత్స తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..